"శనివారం కదా...వీక్ఎండ్ అని మంచిగా రెస్ట్ తీసుకుందాము అనుకున్న..కాని శనివారం కదా..నా భక్తులు ప్రొద్దున నుండి ఊపిరి ఆడానీయకుండా పూజలు అభిషేకాలు ..ఎవరికీ చెప్పాలండి నా భాధా....ఇప్పుడు ఏదో కొంచం ఫ్రీ టైం దొరికింది అని అలా చిన్న కునుకు తీద్దాం అంటే నువ్వేంటి నారదా ఇలా వచ్చావేమిటి" అన్నాడు హరి."నారాయణ నారాయణ ...క్షమించాలి క్షీరసాగర నివాస ..ఇటుగా వెళ్ళుతూ ..మీకు మీ బ్లాగు భక్తుల విన్నపం ఒకటి సమర్పిద్దాం అని..""మొన్న బ్లాగు లోకంలో సంచరిస్తుంటే మీ బ్లాగు భక్తులు నన్ను పట్టుకొని వాడెవడో బిచ్చాచార్య అట మీ భక్తులని బాగా నొప్పించాడు.. వాడిని బయటకి లాగే మార్గమే లేదా అని నన్ను పట్టుకున్నారు..ఏది చెప్పిన వినలేదు..ఆఖరికి ఆ శ్రిమన్నారయుడిని కనుక్కుని వస్తే అంటే కాని వదలలేదు..కలికాలం..మరల రానేమో అని నా తంబురా వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకుని ఈ దిక్కుమాలిన గిటార్ అంటకట్టారు .పరిష్కారం చెప్పి నా తంబురా తీస్కోవాలంట...ఈ గిటార్ వాయించలేక నా భాద నీతో కాక ఎవరితో చెప్పుకోను ..వారికి పరిష్కారం చూపించి నాకు నా తంబురా ఇప్పుంచు నారాయణ" అన్నాడు నారదుడు.
"అదిగో వాడు బ్లాగులోకంలో నుండి తప్పించుకొని భూలోకంలో తిరుగుతూ ఉన్నాడు కదా..ఆహా ఎంత మహదానందంతో ఉన్నాడు ..పాట కూడా పాడుకుంటున్నాడు....వాడు ఇప్పుడు పాడే ఆ పాటలోనే ఉంది నారద వాడిని ఎలా బయటకి లాగలో..విను విని అలోచించి వారికి చెప్పు". అని హరి పరిష్కారం చెప్పాక చెప్పాడు..నారదుడు అయోమయం ముఖం పెడితే హరి తన చేతిలో ఉన్న రిమోట్ తో భూలోకం ఛానల్ పెట్టాడు తన కొత్త LED టీవీలో ... అప్పుడే ఒక కమర్షియల్ అయ్యి పాట స్టార్ట్ అవ్వబోతుంది...నారదుడు lays చిప్స్ పెట్టుకొని చూస్తున్నాడు....
***********************************************************
హే హే హే హే హే హే హే హే.. రు రు రు రు రు రూ రు రూ..
పనిపాట యెటూలేదు బ్లాగుఅన్న రాస్తా బ్రదర్
పనిపాట యెటూలేదు బ్లాగుఅన్న రాస్తా బ్రదర్
తెలుగుబ్లాగు లోకంలో చెప్పలేనివి అన్నీ నావే బ్రదర్ఇంటర్నెట్ ప్రపంచంలో అబద్ధం కూడా నిజంలాంటిదే బ్రదర్
||పనిపాట||
నా బ్లాగులో రోల్స్ పిచ్చ రోల్స్ వాటికి జీవం నా ఊహలు
నా కంప్యుటర్ చెత్తడబ్బారా తమ్ముడూ
నా కీర్తి ఎవెరెస్ట్ కొండ అనుకునేరురా
||నా బ్లాగు||
నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని నవేల్స్ చేత పుచ్చుకొని ఇంటర్నెట్ కి చేరినాను బ్లాగు బ్లాగు అంటున్నాను
బ్లాగులోక్కాన్ని పాలించాలనే చెత్త ఆలోచన నాది బ్రదర్
||పనిపాట||
క్యారెక్టర్లు అన్నీ నావి చేత్తబ్లాగులు అన్నీ నావి
ఎలుగెత్తి చాటుతానురా బ్లాగుల్లో అమాయక జనాలని ఆడిస్తానురా
ఈ జనాలని మోసం చెయ్యడం నా తప్పా
నా కళతో ఆడించడం నా తప్పా
నా కళతో ఆడించడం నా తప్పా
నన్ను మీకు పరిచయం చేసిన మీ లీడర్ని అడగండి బ్రదర్
గట్టిగ అడిగితే నిజం బయటకి వస్తుంది బ్రదర్
||పనిపాట||
'ప్రియ'మైన'సృజన'గీత చేత్తపురుగులం ఊహాలోక బానిసలం
'వన లీడర్'తో నడిపించే కథ నాదిరా తమ్ముడూ నిజమోప్పుకోవడం చాలా బరువురా
బ్లాగులో తప్ప వినేదిక్కులేదు బయటేమో సత్తా లేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టేదిక్కేలేదు
ఈ 'వనం'లో వాళ్ళదే భారమని తెంపు చేయరా బ్రదర్
***************************************************************
మళ్లి కమర్షియల్..టీవీ ఆపేసాడు నారాయణుడు.నారదుడి వంక చూసి.."ఏమీ నారద నీకు కావలసింది దొరికినదా..నేను కొంచంసేపు కునుకు తీయోచ్చా",నారదుడు మొఖము వెయ్యి వోల్టుల బుల్బ్ లాగ వెలిగిపోయింది..."నారాయణ నారాయణ....నా తంబురా నాకు ఇప్పించావు తండ్రి"...అంటూ బ్లాగు లోకానికి పయనమయ్యాడు.