పోయిన సండే టైమ్స్ పేపర్ చదువుతూ ఒక ఆర్టికల్ దగ్గర ఆగాను...మీనాక్షి అని ఒక లేడీ రాసారు..అది ఏంటి అంటే ..
చిన్నప్పటి నుండి వాళ్ళ ఇంట్లో ఒక పనిమనిషి జయ అని, పనిచేసేది..వచ్చి తన పని తానూ చేసుకొని..ఎమన్నా పెడ్తే తిని మళ్లి సాయంత్రం పనికి వచ్చేదంట.అలా రోజులు గడిచేకొద్దీ మీనాక్షికి పెళ్లి అయ్యి ఈ మధ్యనే తనకి పాప పుడితే పుట్టింటికి వచ్చిందంట.సో ఇప్పటికీ ఆ జయనే కాకపోతే ఇప్పుడు నానమ్మ అయ్యింది అని..ఇప్పుడు రోజు తన మూడేళ్ళ మనవరాలు అమృత తనతో పాటు వస్తుంది...జయ పని చేసుకునే అంత వరకు కుర్చుని మళ్లి తనతో ఆ అమృత వెళ్ళిపోతుంది...నాయనమ్మ పని చేసుకునే అంత సేపు అమృత తన తోటి పిల్లలలాగ అల్లరి చెయ్యకుండా బుద్ధిగా ఒక పక్కన కూర్చుని ఉండేది.
ఒకసారి మీనాక్షి కూతురు రెండు నెలలు ఉన్నపుడు అమృత తన గది వైపు వచ్చి తన కూతురుని చూసి బయట నుండి తెగ ముచ్చటపడటం లోపలి రమ్మంటే రాలేదంట.ఇలా రోజు వచ్చి తన కూతురుని చూసి బయటనుండే సంబరపడి అలాగే ఉండేదంట జయ వచ్చే వరకు.ఒకరోజు అమృత,మీనాక్షిని తను ఆ చిన్ని పాపని ముట్టుకోవచ్చ అని అడిగితే, మీనాక్షి లోపలి వచ్చి ఆడుకో పాపతో అన్నదంట.అలా లోపలికి వచ్చి పాప ని ముట్టుకొని తెగ ఆనందపడేది..రోజు అలా పాపతో ఆడుకునేది అమృత.ఒక రోజు జయ పని అయిపోయాక తీసకేల్లటానికి వస్తే అమృత జయని "ఆ చిన్న పాప చాలా తెల్లగా ఉంది మరి నేను ఎందుకు ఇంక నల్లగా ఉన్నాను" అని అడిగింది.జయ అమృతని అక్కడనుండి తిసుకేల్లిపోయిందట ...అలా కొన్ని రోజులు అమృత కనపడలేదు..తర్వాత ఒకరోజు అమృత వచ్చి అలా చూస్తుంటే..లోపలి రమ్మంది మీనాక్షి..వచ్చాక అమృత గది అంత చూస్తూ ఒక క్రీం ని చూపించి అది తీస్కోవచ్చా అని అడిగింది.మీనాక్షి కొంచం ఆశ్చర్యపడి ఎలాగో అది కొద్దిగే ఉంది కదా..సరే తీస్కో అంది.అది చిన్న పిల్లలకి రాసే క్రీం.జయ వచ్చి ఎందుకు తీస్కున్నావ్ అది ఇచేయ్ అంటే మీనాక్షి నే ఇచ్చింది అనట్టుగా చెప్పిందంట..అయిన ఇచ్చేయ్ అంటే.. "అది రాసుకొని నేను తెల్లగా ఐతే ఇంట్లో అబ్బాయి కావాలని లేదా తెల్ల అమ్మాయి కావాలని గోడవపడరు కదా అమ్మ,నాన్న"అని అంటుంది.మీనాక్షి చాలా బాధపడి ఇంక ఈ లింగ వివక్ష,వర్ణ వివక్ష నడుస్తున్నాయా అని...తను తన భర్త కలిసి మాట్లాడుకొని..అమృత చదువు బాధ్యతలు తీస్కున్నరాన్ట..
బాగుంది కదండీ....ఇది చదివి చాలా మంది ఒకటే అనుకుంటారు అవును పాపం అమృత...మీనాక్షి మంచిపని చేసింది...ఇలా...కాని నాకు ఏమనిపించింది అంటే ఫ్రాంక్ గా చెప్పాలి అంటే నాకు అమృత ఆ చిన్న పాపని చూస్తూ పడ్డ ఆ ఆనందం...ఆ పాపని పట్టుకుని పడ్డ సంబరం..ఆ కళ్ళల్లోని ఆనందం...చాలా బాగా అనిపించింది...ఆ అమాయకమైన మనస్సు ఎంత గాయపడిందో అని తల్చుకున్నాను వాలింట్లో గొడవ పడ్తున్నారంటే. ఇవాళ రేపు ఈ లింగ వివక్ష తక్కువైంది..కాని మొగుడు పెళ్ళాల గొడవలు పిల్లల మీద ప్రభావం చూపిస్తున్నాయి అనడానికి ఇదే నిదర్శనం. కాని మా గురువుగారికి ఇంకోల వచ్చింది ఆ ఆలోచన...ఇక్కడ నేను కూడా అది గమనించలేదు..ఈ ఆర్టికల్ గురుంచి చర్చ జరిగేటప్పుడు మా గురువుగారు అన్నారు...ఆ పిల్ల సమస్యకి పరిష్కారం భలే ఆలోచించింది అని..అంత చిన్న వయస్సులో తను తన ఇంట్లో జరిగే గొడవకి పరిషారం ఏంటా అని అలోచిన్చిందంటే..ఆ వయస్సులో తనకున్న ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్ల్స్ రేపు ముందు ముందు తనని ఎంత గొప్ప స్థానానికి చేరుతుందని...
మీనాక్షి ఇంక వాళ భర్త తనని చదివిస్తున్నందుకు తను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చెయ్యదు ...తన ఇంట్లో వాళ్ళే కాదు తనని చదివించిన వాళ్ళు కూడా గర్వపడేటట్టు చేస్తుంది అని ఆశిస్తూ....
2 comments:
Nice One. Even last week i too read it. I am a regular follower of Times Life (Soul Curry column). Thank You For Mentioning it here.
thanks buddy....bt u dnt mention thanks ok...i like such topics...so usually read thm much...
Post a Comment