ఓ బాతి కథ

Sunday, February 13, 2011

నమస్తేనే..అందరు బాగున్నారే?..ఎం లేదే..జరా ఒక నీతి కథ జెప్పి పోదాం అని అచ్చినా గంతే...గా కథ ఎందనా..ఇది ఒక్క పొగరుమోతు బాతు కథ ..మా ఉర్లా  ఉంటుండేలే...గది ఏందంటే బడే బద్మాష్ బాతు..దాని పేరు బాతి అని దాని పెంచేతోడు భలే ముద్దుగా పెట్టిండు.....గసలేందంటే..గా బాతాక్కి  మాస్త్ గమండ్ ..ఎందుకో ఎరుకన..దాని ఈకలను జూసుకొని...ఎం లేదు కాకా..దాని ఈకలు బంగారం లెక ఉంటుండే(బంగారు గుడ్డలు ఎం పెడ్తుండె కాదు తీ..)..గిది పుట్టినా సంది కెళ్ళి..ఓ అన్ని బాతులు,జనాలు మస్తుగా మెచ్చుకుంటుండె ..దాని ఈకల రంగు జూసి.మొదటల బాగానే ఉంటుండే దాని తీరు..టైం కి పెడుతుండే గుడ్లు..అన్ని బాతులతో ఈ బాతి బాగానే ఉంటుండే ..కాని రాను రాను దాని తీరు మారిపోయే...మస్తు గమండ్ తో ఉంటుండే గీ బాతి..దీని తిరు జూసి మిగతా బాతులు దీనికి ఒక ముద్దు పేరు కూడా పెట్టినాయ్..ఏందో ఎరుకనా..హి హి హి "గలీజు బాతి" అని.బాగున్నదిలే..ఇగ దీని తీరు జూసి ఏ బాతు గీ బాతితో మాట్లడకపోతుండే..గీ బాతుకుడా నాకేమి తక్కువ అని ఓ పోస్ కొడుతుండే..ఇగ ఒక్కతే అయినది గదా గీ బాతి...ఎం చేస్తుండే...రోజు తిరగాలే..గుట్లోకేల్లినాక..ఈకలకి కథలు జెప్పాలె..ఇంక ఎవరున్నారు గీ గలీజు బాతి కథలు ఇన్నికి..ఇగా దీని కథలు ఇనలేకా ఈ ఈకలు మస్తు పరేషాన్ అయితుండే..గిట్ల ఎన్ని రోజులు ఇంటి గదా..ఇలా మెల్లగా ఒక్కో ఈక గీ కథలు ఇనలేకా నిక్క నిక్కపొడుచుకుంటుండె..ఇలా నిక్కపొడుచుకొని గట్లానే ఉంటుండే...గా బాతి బయటకి పోయినప్పుడు మిగతా బాతులు జూసి..నవ్వుకుంటుండె..జూడవే గా గలీజు బాతి ఈక ఒకటి గేట్లున్నదో అని...అన్ని బాతుల ముంగట గిది కోపం ఐతే బాగోదు కదా..అలా ఎం తెల్వనట్టు గూటికి వస్తుండే..గూటికి వచినాకా...గది నిక్కబోడుచుకున్న ఈకని మస్తు తిడ్తుండే..గా తిట్లని ఇనలేకా గది సోశోచ్చి పడుతుండే..గిల కొన్ని దినాలయినాక...ఎన్ని దినాలని ఇలా కథలు ఇంతయి జెప్పు..ఇలానే గది ఎంత తిట్టిన..అలాగే ఈక నిక్కపొడుచుకొని ఉంటె ..గీ గలీజు బాతు..."దీని తల్లి..ఏందే నా మీద ఉంది నా మాటకే ఎదురా..అని..ఈకని పీకేస్కుంటుండె..ఇలా ఒక్కో ఈక తట్టుకోలేక పోతే గీ బాతి ఒక్కో ఈకను పీకుతాపోతుండే....గీ ఈక పీకబట్టే ..గా ఈక పీకబట్టే...పైన ఈక పీకబట్టే..ఎనకున్న ఈక పీకబట్టే...
ఈడ పీకే గాదా పీకే..ఇలా పీకుతా బోయుండే..ఇలా జేస్తే..ఎం మిగులతాది జెప్పు...దాని వంటి మీద ఉన్న ఈకలన్నీ పాయె..కొన్ని ఏదో అక్కడక్కడా ఉన్నవి గంతే..


  ఇగా గీ బొచ్చు లేని గలీజు బాతిని జూసి..జనాలు అడగబట్టే దానిని పెంచినోదిని..ఏందిరా బాలరాజు నీ బాతికి రోగామోచినదా గట్లా తయారయ్యింది..ఇగ ఊరుకుంటాడా దానిని పెంచెటోడు..దానిని అమ్మ జూడబట్టే..కాని ఎవరు కొంటుండెగాదు....వీడికి భయంబట్టె..ఏందిరా దీనికి నిజంగానె రోగం బట్టినదా ఏంది..అని దాని పీక నొక్కె..బస్..కామ్ కతం..దుకాన్ బంద్.


.సమజయ్యినదా ఈ కథలా నీతి ఏంది అని..ఈకలు పీక్కుంటె..ఇజ్జత్ ఏడుంటదే..గదే రా ..మన ఇజ్జత్ కాపాడుకొనికి బట్టలు ఏస్తాం..ఎయ్యక పోతె..ఇజ్జత్ ఉంటదా..పిచ్చి పట్టింది అంటారు..తీస్కబోయి..పాగల్ ఖానాలా ఎస్తరు..ఈడా ఈకాలు కాదే పీక్కొవాల్సిందీ..గమండ్ తీసేస్కొవాల్నే..ఈలయితే తగ్గించుకోవాలే..సమజయ్యింది అనుకుంటున్న..ఈ పారి ఎరయిటి కథతొ వస్తా తీ..నాకు సుక్కేసుకొని..దమ్ బిర్యాని తినే టైం అయ్యింది..టాటా..

4 comments:

శరత్ కాలమ్ said...

మీరు చెప్పిన విషయం గురించి నేను వ్యాఖ్యానించలేను గానీ మీరు పెట్టిన రెండో ఫోటో మాత్రం సూపర్ :))

బడ్డి said...

@sarath..

 పొగరు తగ్గని బాతులు గట్లనే ఉంటాయ్..గీ ఫొటో లెక్కనే..ఇంటి పెద్ద వరకు పోతే గప్పుడు దుకాన్ బంద్.కమ్మ్యునిటి కమ్మ్యునిటీ లాగానే ఉండాలే...చెత్త పనులకు గాదే..రెచ్చగొడితే ఇంటి వరకు పోనికీ భయపడం...గమండ్ గా లెక్కన తగ్గిస్తామ్..గిది నీతి కథ..నిజంగ గూడ గంతే

Anonymous said...

కెవ్వు..వ్వు..వ్వు... కేక..
మీ viewers బాతి grill తో విందు ఎపుడు పెడుతున్నారు

బడ్డి said...

@anon
వ్యుఅర్స్ కి మంచిగా కోడి గ్రిల్ ..ముట్టన్ దం బిర్యానీలు ఈ బాతు కాదు కాదు బాతి గ్రిల్ ఎందుకు ఛీ..ఈ బాతి గ్రిల్ వాళ ఇంట్లో ఇంక చుట్టుపక్కలవాళ్ళకి పెడదాము..ఈ బాతి ఇలా అవ్వడానికి పెంచినోడిదే(ఇంట్లో పెద్దదే) కదా తప్పు.వాడితోనే తినిపిస్తాను.

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):