బాతి బొంద ...ఊప్స్ బోండ..బాతి బోండాలు..

Tuesday, March 1, 2011


మాంసాహారంలో అంత ప్రాముఖ్యత లేనిది బాతు మాంసం.

ఈ మధ్య మనదేశంలో కూడా బాతి మాంసాన్ని విరివిగా వాడుతున్నారు.

మంచి బలవర్ధకమైన ఆహారం అవునో కాదో తెలియదుకాని ఈ బాతి

మాంసం చాల కంపుగా ఉంటుంది. ఈరోజునుండి కొన్ని రోజుల

వరకు బాతి స్పెషల్స్ తయారీ విధానం ఇక్కడ చెబుతాను

కావలసిన వస్తువులు:








బాతి మాంసము -1 కిలో




చామ దుంపలు – 2






ఉల్లిపాయ – 1 (అలంకారనికే..అందుకే ఒకటి చాలు)






పచ్చిమిరపకాయలు – 3






పచ్చ గడ్డి – 2 కట్టలు




నిమ్మకాయలు - 4




తెలగపిండి – 1 తట్ట




గొడ్డు కారం  – 50 tsps






బట్టలసోడా -చెంబుడు




ఉప్పు -ఒక డేక్ష అంత


కొబ్బరి నూనే - 5 లీటర్లు


బాతి మాంసం ముక్కలు, చామ దుంపలు విడివిడిగా ఉప్పులో కలిపి అల ఉంచి..కొంచంసేపయ్యాక  ఉడికించాలి. ఒక గిన్నెలో ఉడికించిన చామదుంపలు పైచెక్కు తీసి పొడిపొడిగా మెదిపి వేయాలి. ఇందులో ఉడికించిన బాతి మాంసం, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మ రసం, సన్నగా తరిగిన పచ్చ గడ్డి, డేక్షాడు ఉప్పు వేసి కలిపి క్రికెట్ బంతి సైజులోఉండలు చేసి పెట్టుకోవాలి. తెలగపిండిలో తగినంత ఉప్పు, గొడ్డుకారం పొడి, బట్టలసోడా వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి(సాంబారులా కాదు...ఇడ్లి పిండి ఉంటది చూడు అలా). ఇంతకు ముందు చేసి పెట్టుకున్న ఉండలను ఒక్కటొక్కటిగా తెలగపిండి మిశ్రమంలో ముంచి మరుగుతున్న కొబ్బరినూనెలో వేసి నలుపు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి(మాడ్చుకోవచ్చుగా అంటారేమో..మాడ్చేదానికి ఇంత కష్టపడటం దేనికి..). అంతే బాతి బోండాలు రెడీ..ఇది ఒక వెల్కం డిష్ లాగా మన కంమ్యునిటిలో కొత్తగా జాయిన్ అయిన వారికి తినిపించోచ్చు(అదే జూనియర్స్ ని సీనియర్స్ చేస్తారు రాగింగ్..అలా అన్నమాటా..)
పొని ఇలా కూడ చెయ్యొచ్చు..ఇది ఒక పరీక్ష లాగ అన్నమాటా.ఇలాంటివి తిని తట్టుకొగల్గితేనే..కమ్మ్యునిటిలో జరిగే వాటిని చూసి తట్టుకోగలరు.అర్ధమయింది కదా...

No comments:

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):