ప్రేమా..వ్యామోహమా..

Wednesday, September 22, 2010

ఈ మద్య మనం చాలా చూస్తున్నాం..ప్రేమించలెదన్న కోపంతో,ప్రేమించి మోసం చేసారన్న కోపంతో అలా..చంపుకుంటున్నారు.ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించేవారు తక్కువ..కాని మీడియా వారికి...కొన్ని సంఘాలకి మాత్రం ఇలాంటి విషయాలు పండగే.అలంటి హత్యలు మనము నివారించగలమా? అలా చెయ్యడానికి అవసరమైన్య చర్యలు ఏంటి? ఇలా ఆలోచించే కంటే..అలా జరిగింది అని రభస చేసే వారే అధికం.
            అసలు యువత ఎందుకు ఇలా అవుతుంది? దానికి కొన్ని కారణాలు...
  1. సినిమాల ప్రభావం...ఇనాటి యువతపై సినిమాల ప్రభావం చాలా ఉంది..అంటే వీరు వాస్తవాన్ని ఒప్పుకునే స్టేజిలో లేరు,వారికి ఇలా సిని హీరో లాగానో...సిని హీరోయిన్ లాగానో వారి జీవితం కూడా అలాగే ఉండాలి..వారికి లాగ తమకి ఒక గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఉండాలి..అలా..వారికది వ్యామోహమో..లేదా ప్రేమో కూడా తెలియదు.కాని అదే ప్రేమ అని అనుకుంటారు.
  2. ఒంటరితనం....ఇలా అవ్వడానికి ఇది ఒక కారణం...ఇంట్లో వాళకి దూరంగా ఉంటూ(దూరంగా అంటే ప్రత్యక్ష దూరంగానే కాదు...మనసులు దూరంగా కూడా..అంటే ప్రేమానురాగాలు లేకపోవడం..),తల్లితండ్రుల పర్యవేక్షణ లేకపోవడం(ఇది అన్ని సందర్భాల్లో కాదు...కొందరు దగ్గర ఉంది కూడా పట్టించుకోనివాళ్ళు ఉన్నారు)
  3. మానసికవత్తిళ్ళు...ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం.ఇలాంటి వాటిని తట్టుకోలేకా...ఎవరో ఒకరు తోడుంటే బాగుంటది అన్న స్టేజిలోకి వెళ్ళడం అలా...
  4. డబ్బు,ఆకర్షణ,అందం..ఇలా వీటితో సొంత గుర్తింపు కోసం తహతాహ లాడే కోరికలు.. 
ఇవి ముఖ్యమైన కారణాలు...ఇవి కాకుండా కొన్ని చిన్న చిన్నవి కూడా ఉన్నాయి..వీటిల్లో ముఖ్యమైనది డేటింగ్ సంస్కృతి,ఇంటర్నెట్ ..ఇలా ఇవి కూడా కొన్ని కారణాలు.ఇలా ఇలాంటివాటి వలయంలో చిక్కుకుని యువత బయటపడలేకపోతుంది.
ఇక్కడ ఒక్క అబ్బాయిల తప్పే కాదు..అటు అమ్మాయిలది,సమాజానిది కూడా ఉంది.ఎక్కడైనా మంచి చెడు అని రెండుంటాయి..అవి అందరిలో ఉంటాయి...ఎవరికీ ఎవరు మంచివారు కాదు ఎవరికీ ఎవరు చెడ్డవారు కాదు...ఈ రెండు అంటే మంచి చెడు కలయికే జీవితం....కాని మనం చెప్పుకునే సమాజ సేవ సంఘాలు కొన్ని..ఇలాంటి వాలని ఎలా మార్చాలి అని ఆలోచించే బదులు ఇలాంటి సంఘటనలని రభస చెయ్యడం ఏమాత్రం బాగోలేదు.

శుభోదయం....

Thursday, September 16, 2010

గుడ్డు మార్నింగు ......వినాయకుడి సంబరాల్లో మినిగిపోయారు అందరు..కదా...చిన్నప్పుడు భలే అనిపించేది..ఉదయాన్నే లేవడం...నాన్నగారి వెంట పూజ సామాగ్రి కొనటానికి వెళ్ళడం..అక్కదేకేల్లక మారాం చెయ్యడం..పెద్ద విగ్రహం కొను..నా ఫ్రెండ్స్ కి చెప్పాలి అని..అందరికంటే పెద్ద విగ్రహం ఉండాలి అని...అప్పుడు నాన్న బుజ్జగించడం....ఏదో ఒకటి వేరేది కొనివ్వడం..అలా....ఇంటికొచ్చాక పూజ ఎప్పుడూ అవ్తడా ఎప్పుడూ ఆ ఉండ్రాళ్ళు తిందామా అని చూడటం..(చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా అదే పరిస్తితి).
     మనకి తెలిసినంత వరకు వినాయకుడు శివపార్వతుల ముద్దుల కొడుకు...చదువుకి,జ్ఞానానికి,అవరోధాలు రాకుండా..మనము ఎక్కువ మొక్కుకుంటాము.మీకు తెలుసా..వినాయకుడిని పూజ చేస్తే అష్ట సిద్ధులు అందిస్తాడని అంటారు.అవి ఏంటి అంటే...నిరాడంబరత,కళా నైపుణ్యం,అధికారం,సూక్ష్మ ద్రుష్టి,విద్యా,ప్రణాళిక,కార్యసాధన.

       అసలు వినాయకుడిని మాములుగా చూడడం అంటే దేవుడు అన్న భక్తీతో కాకుండా ఏంటో తెలుసుకుందాం...
 గణపతి రూపం..పెద్ద పొట్ట,చెవులు చాట లాగ..ముఖ్యంగా ఏనుగు మొఖం,చిన్న కళ్ళు,నోటికి అడ్డంగా తొండం...మరచిపోయా..అతనికి వాహనం..ఒక చిన్ని ఎలుక..గణపతి పెద్దగ మాట్లాడాడు(బాబోయ్ తొండం అడ్డు ఉంది అని కాదు..అక్కడికే వస్తున్నా...)..అలా అద్దం ఉంటె ఏంటి అంటే..తక్కువ మాట్లాడు,చాటంత చెవులు...చాట తెల్సా మీకు...మనం బియ్యంలో రాలు తీయడానికి వాడుతామే అలా...విన్న మాట్లల్లో..చెడుని తీసి మంచిని గ్రహించు అని...అంత పెద్ద పొట్ట..ఎందుకో తెల్సా? విన్నవి అలా వదిలేయకుండా...దాచుకొమ్మని.చిన్న కళ్ళు....బాహ్య ప్రపంచం మీద అనవసరమైన ఆస మాని...అవసరమైన దాని మీదనే..ని ద్రుష్టి పెట్టు అని...అర్ధమైందా? హిహిహి.గణపతి పూజ లో ఉపయోగించే పత్రి...అవి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
   అవును మరచిపోయ..అంత పెద్ద వినాయకుడికి ఇంత చిన్ని ఎలుక ఏంటి అనా....ఏమీ లేదు....కార్యసాధనకి కావలసింది..శక్తి యుక్తి..సౌకర్యాలు కాదు అని అంట.
      వినాయకుడు బ్రహ్మచారా? అవును అంటారు కొందరు..కాదు అంటారు కొందరు...దీనికి ఒకటి చెప్పారు...వినాయక చవితి చంద్రుడు హస్త నక్షత్రంలో ఉంటాదంట.చంద్రుడు అంటే మనస్సు.హస్తా అంటే చెయ్యి..చంద్రుడు హస్తా లో అంటే...మనసు మన చేతుల్లో ఉండటం..అంటే అప్పుడే అనుకున్న పని మీద జయం కలగటం.అదే కార్యసిద్ధి.అందుకే అది సిద్ధి అంట..బుద్ధి అంటే ఆలోచన...ఆలోచనలు అదుపులో ఉంటె కార్యసిద్ధి సాధ్యం అని...ఈ విదంగా..సిద్ధిబుద్ధిలను తన భార్యలుగా చూపి మనకి చెప్తున్నాడు అని అంటారు.

అరవింద్ కంటి ఆసుపత్రి.....

Saturday, September 4, 2010

అరవింద్ కంటి ఆసుపత్రి...ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా?...నిజం చెప్పాలంటే మనలో చాలా మందికి ఈ ఆసుపత్రి గురుంచి తెలియదు.ఇది ఈ ప్రపంచంలోనే మంచి పేరున్న,అన్నిటికంటే పెద్దది..అది ఎక్కడ ఉంది అనుకుంటున్నారు?..ఎక్కడో బయట దేశాలల్లో కాదు..మన దగ్గరే...మన దేశంలోనే..తమిళనాడులో మధురైలో ఉంది.ఈ ఆసుపత్రి ఒక విప్లవాత్మకమైన మార్పు తీస్కోచింది.
    ప్రపంచ జనాభాలో  24 మిలియన్ మంది అంధులు ఉన్నారు.అందులో..మూడో వంతు అనవసరంగా అంధత్వంతో భాధపడుతున్నారు,అంటే వీరికి చికిత్స ఉంది..కాని దీనికి సరిపడా వైద్యులు లేరు.అయితే అరవింద్ ఆసుపత్రి ఏమీ చేసిందంటే సర్జెన్ పనితనాన్ని పెంచింది.ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే..దాదాపు అందరికి ఉచితంగా చికిత్స చేస్తుంది...దానికి వచ్చే రెవిన్యూ ఎలా అంటే..వాలకి వచ్చే రోగుల్లో ౩౦% రోగులకే ఫీజు తీసుకుంటారు..అది వారు ఇస్తేనే(అంటే వాళు ఇవ్వగాలిగితేనే).ప్రతి సంవత్సరం దాదాపు 2 .4 మిలియన్ రోగులకి,28600 cataract operations చేస్తారు వీరు.దీని బట్టి అర్ధం చేసుకోండి..ఇది ఎంత పెద్దదో అని.
      ఈ ఆసుపత్రి ఎలా మొదలయ్యింది? అదే కదా మీ సందేహం....దీనికంతా కారణం Dr గోవిందప్ప వెంకటస్వామి,వీరు మదురై మెడికల్ కాలేజీలో ఒకప్పుడు ప్రొఫెసర్ గా  పని చేసారు ఉద్యోగ విరమణ చేసారు.వీరిని అందరు Dr V అని అంటారు.
  అసలు Dr V చిన్నపటినుండి గైనకాలజిస్ట్ అవుదాము అనుకున్నారు  కాని చదువు మధ్యలోనే కీళ్ళకి సంబందించిన వ్యాదితో తన చేతులు ఆపరేషన్ కి సహకరించవు..అయిన..ఆ పట్టా పుచ్చుకున్నాడు.కాని ఆపరేషన్లు చెయ్యడం కుదరక..తను మళ్లి మెడికల్ కాలేజీలో చేరాడు..ఈ సారి కంటికి సంభందించిన విద్య నేర్చుకున్నాడు(ఏమీ అనుకోవద్దు specialisation అని అనటం రాకా మళ్లి opthomology ని తెలుగులో ఏమంటారో తెలియదు..హి హి హి...)..అలా కాలేజీలోనే అధ్యాపకుడిగా చేరాడు తర్వాత..తను..తన విద్యార్దులు కలిసి..అలా ఉర్లకేల్లి చికిస్తలు చేసేవారు. అలా తను 1976 లొ ఉద్యోగ విరమణ చేసి..అక్కడితో ఆగకుండా...అంధులు ఇంకా సేవ చెయ్యాలి అని ..ఒక ఆసుపత్రి పెట్టాలి అని అనుకున్నారు.అలా అనుక్క్న వెంటనే..తన చెల్లెలిని ఆమె భర్తని(ఇద్దరు కంటి వైద్య నిపుణులే) తనతో కలవమన్నారు.అప్పుడు వారు అమెరికాలో ఉంటున్నారు.వారికి ఇండియాకి వచేయ్యలని లేదు..కాని తనని పెంచింది పెద్దన్న(చిన్నప్పుడే వారి తండ్రి చనిపోయారు) కాబట్టి వారు తిరిగి వచేయ్యడానికి సిద్దమయ్యారు.అలా పదకొండు పడకల ఆసుపత్రిల మొదలయ్యి..ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఆసుపత్రిగా పేరు గడించింది.
 దీనికోసం వారు ఎంతో కష్టపడ్డారు..మొదట్లో తమ నగలు తాకట్టు పెట్టి మరి .....అలా ఎన్నో కస్టాలు పడి..రోగులకి ఎటువంటి ప్రాబ్లం  కలిగానీయకుండా..ఇప్పుడు ప్రపంచంలోనే సాటి లేని కంటి ఆసుపత్రిగా ప్రఖ్యాతి గడించారు.
    ఇంకా ఉంది...ప్రస్తుతం..విరామం.

శ్రీ కృష్ణ జన్మాష్టమి...శుభాకాంక్షలు

Wednesday, September 1, 2010

హాయ్ శుభోదయం...శ్రీ కృష్ణ జన్మాష్టమి...శుభాకాంక్షలు...
       ఏంటి ఇవాళ బుర్ర తింటాడా వీడు అనా...ఇవాళ కృష్ణుడి గురుంచి చెప్తాను(నా గురుంచి కాదు..నాది టాప్ సిక్రెట్)..మీ అందరికి తెలిసిందే..కాని ఏదో చెప్తాను..ఓకే?
    శ్రీ కృష్ణ జన్మాష్టమి శ్రావణమాసంలో వచ్చే అష్టమి రోజున జరుపుకుంటారు...ఆ రోజే కృష్ణుడు పుట్టింది..పుట్టిన నక్షత్రం రోహిణి ..ఈ పండుగ రెండు రోజులు జరుపుకుంటారు(ఇది చాలా మందికి తెలియదులే)..ఇలా రెండు రోజులు ఎందుకు జరుపుతారు? ఏమిలేదు..రోహిణి నక్షత్రం,అష్టమి రెండు ఒకటే రోజు రాకపోవాచు అందుకే అలా....పండుగ లో ముందు రోజు కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అంటారు...ఆ తరవాతి రోజు కాలాస్టమి.
       కృష్ణుడి జీవితం నుండి మనం చాలా నేర్చుకోవచ్చు...దొంగతనం,కొంటెతనం కాదు..మచ్చుకకి కొన్ని చెప్తాను(అంటే చెప్పుకుంట పోతే...టైం సరిపోదు).చిన్నప్పుడు వెన్న దొంగతనం చేసేవాడు స్నేహితులతో కలిసి..దేవుడు అంటారు కదా.మరి వెన్న కావాలి అని తలచుకుంటే చాలు..మరి దొంగతనం ఎందుకు(పబ్లిసిటీ కోసం అనుకుంటున్నారా..కాదు బాబోయ్ కాదు)..ఇక్కడ మనకి ఎం చెప్పదలుచుకున్నాడు అంటే చేసే పని ఏదైనా టీం వర్క్ తో చేస్తే..ఏదైనా సాదిన్చవచ్చు అని..అది మనకు చిన్న దొంగతనం లాగ కనపడ్తుంది..కాని అలా ఫ్రెండ్స్ తో కలిసి ప్లాన్ చేసి వెన్న కుందని సాదించడం అంటే,మనకి టీం వర్క్ ఎలా ఉండాలో నేర్పుతునట్టే కదా..అందరితో కలిసిపోవటం,అందరిని గైడ్ చెయ్యడం..ఇలా చాలా నేర్చుకోవచ్చు..కృష్ణుడు ఒక డీల్ మేకర్ ఎలా ఉండాలో కూడా చూపించాడు...ఏదన్న పని చేపించాలి అంటే ఎలా ఒప్పించాలి..వాక్ చాతుర్యం ఎలా ఉండాలి..నొప్పించకుండా తప్పులు ఎలా చూపాలి...వగైరా వగైరా....మనకి మనపై నమ్మకం(కాన్ఫిడెన్సు) ఎలా ఉండాలో కూడా చెప్పకనే చెప్పాడు..చిన్నప్పుడు పెద్ద పెద్ద పనులు చేసి..అంటే మరీ మేతి మీరిన నమ్మకం పెట్టుకోమని కాద్ఫు..నీకు అవ్తుంది అంటే(నీవు ఆ పని చెయ్యగలవు)..ఆలోచించాల్సిన పనిలేదు చేసెయ్యాలి అలా...
      కృష్ణుడి దగ్గర స్నేహం గురుంచి కూడా నేర్చుకోవాలి.కుచేలుడు,శ్రీ కృష్ణుడు చిన్నపాటి స్నేహితులు కదా..కలిసి చదువుకున్నారు...కుచేలుడు పెళ్ళయ్యాక...చాలా పేదవాడిగా జీవించాడు.తనకి సహాయం చెయ్యమని అడుగుదామని శ్రీకృష్ణుడి  దగ్గరకు వచ్చి అడగలేకా..అలాగే తిరిగివేల్లిపోయాడు..అది ముందే గ్రహించి.అతనికి సహాయం చేసి..తన స్నేహధర్మాన్ని చూపించాడు..మీకు తెలుసా..దశావతారాల్లో మిగిలిన ఏ అవతారానికి జగద్గురువుగా ప్రస్తుతి లభించలేదు..ఒక్క ఏ శ్రీకృష్ణ అవతారానికి తప్ప...ఎందుకో తెలుసా..ప్రపంచ ఖ్యాతి గడించిన..భగవద్గీత..భోదించి ప్రపంచానికే గురువుఅనిపించుకున్నాడు..అందుకే 'కృష్ణం వందే జగద్గురుం' అన్నారు..
  ఇవన్ని నమ్మాలో లేదో తెలియదు కాని మనము చాలా నేర్చుకోవచ్చు..దీని బట్టి ఏమీ తెలుస్తుంది?..మన పూర్వికులు ఎంతగా ముందుచూపు గలవారో అందుకే అన్ని మనకి ఇలా పురాణాల రూపంలో  అందించారు..
 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):