అరవింద్ కంటి ఆసుపత్రి...ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా?...నిజం చెప్పాలంటే మనలో చాలా మందికి ఈ ఆసుపత్రి గురుంచి తెలియదు.ఇది ఈ ప్రపంచంలోనే మంచి పేరున్న,అన్నిటికంటే పెద్దది..అది ఎక్కడ ఉంది అనుకుంటున్నారు?..ఎక్కడో బయట దేశాలల్లో కాదు..మన దగ్గరే...మన దేశంలోనే..తమిళనాడులో మధురైలో ఉంది.ఈ ఆసుపత్రి ఒక విప్లవాత్మకమైన మార్పు తీస్కోచింది.
ప్రపంచ జనాభాలో 24 మిలియన్ మంది అంధులు ఉన్నారు.అందులో..మూడో వంతు అనవసరంగా అంధత్వంతో భాధపడుతున్నారు,అంటే వీరికి చికిత్స ఉంది..కాని దీనికి సరిపడా వైద్యులు లేరు.అయితే అరవింద్ ఆసుపత్రి ఏమీ చేసిందంటే సర్జెన్ పనితనాన్ని పెంచింది.ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే..దాదాపు అందరికి ఉచితంగా చికిత్స చేస్తుంది...దానికి వచ్చే రెవిన్యూ ఎలా అంటే..వాలకి వచ్చే రోగుల్లో ౩౦% రోగులకే ఫీజు తీసుకుంటారు..అది వారు ఇస్తేనే(అంటే వాళు ఇవ్వగాలిగితేనే).ప్రతి సంవత్సరం దాదాపు 2 .4 మిలియన్ రోగులకి,28600 cataract operations చేస్తారు వీరు.దీని బట్టి అర్ధం చేసుకోండి..ఇది ఎంత పెద్దదో అని.
ఈ ఆసుపత్రి ఎలా మొదలయ్యింది? అదే కదా మీ సందేహం....దీనికంతా కారణం Dr గోవిందప్ప వెంకటస్వామి,వీరు మదురై మెడికల్ కాలేజీలో ఒకప్పుడు ప్రొఫెసర్ గా పని చేసారు ఉద్యోగ విరమణ చేసారు.వీరిని అందరు Dr V అని అంటారు.
అసలు Dr V చిన్నపటినుండి గైనకాలజిస్ట్ అవుదాము అనుకున్నారు కాని చదువు మధ్యలోనే కీళ్ళకి సంబందించిన వ్యాదితో తన చేతులు ఆపరేషన్ కి సహకరించవు..అయిన..ఆ పట్టా పుచ్చుకున్నాడు.కాని ఆపరేషన్లు చెయ్యడం కుదరక..తను మళ్లి మెడికల్ కాలేజీలో చేరాడు..ఈ సారి కంటికి సంభందించిన విద్య నేర్చుకున్నాడు(ఏమీ అనుకోవద్దు specialisation అని అనటం రాకా మళ్లి opthomology ని తెలుగులో ఏమంటారో తెలియదు..హి హి హి...)..అలా కాలేజీలోనే అధ్యాపకుడిగా చేరాడు తర్వాత..తను..తన విద్యార్దులు కలిసి..అలా ఉర్లకేల్లి చికిస్తలు చేసేవారు. అలా తను 1976 లొ ఉద్యోగ విరమణ చేసి..అక్కడితో ఆగకుండా...అంధులు ఇంకా సేవ చెయ్యాలి అని ..ఒక ఆసుపత్రి పెట్టాలి అని అనుకున్నారు.అలా అనుక్క్న వెంటనే..తన చెల్లెలిని ఆమె భర్తని(ఇద్దరు కంటి వైద్య నిపుణులే) తనతో కలవమన్నారు.అప్పుడు వారు అమెరికాలో ఉంటున్నారు.వారికి ఇండియాకి వచేయ్యలని లేదు..కాని తనని పెంచింది పెద్దన్న(చిన్నప్పుడే వారి తండ్రి చనిపోయారు) కాబట్టి వారు తిరిగి వచేయ్యడానికి సిద్దమయ్యారు.అలా పదకొండు పడకల ఆసుపత్రిల మొదలయ్యి..ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఆసుపత్రిగా పేరు గడించింది.
దీనికోసం వారు ఎంతో కష్టపడ్డారు..మొదట్లో తమ నగలు తాకట్టు పెట్టి మరి .....అలా ఎన్నో కస్టాలు పడి..రోగులకి ఎటువంటి ప్రాబ్లం కలిగానీయకుండా..ఇప్పుడు ప్రపంచంలోనే సాటి లేని కంటి ఆసుపత్రిగా ప్రఖ్యాతి గడించారు.
ఇంకా ఉంది...ప్రస్తుతం..విరామం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment