హాయ్ శుభోదయం...శ్రీ కృష్ణ జన్మాష్టమి...శుభాకాంక్షలు...
ఏంటి ఇవాళ బుర్ర తింటాడా వీడు అనా...ఇవాళ కృష్ణుడి గురుంచి చెప్తాను(నా గురుంచి కాదు..నాది టాప్ సిక్రెట్)..మీ అందరికి తెలిసిందే..కాని ఏదో చెప్తాను..ఓకే?
శ్రీ కృష్ణ జన్మాష్టమి శ్రావణమాసంలో వచ్చే అష్టమి రోజున జరుపుకుంటారు...ఆ రోజే కృష్ణుడు పుట్టింది..పుట్టిన నక్షత్రం రోహిణి ..ఈ పండుగ రెండు రోజులు జరుపుకుంటారు(ఇది చాలా మందికి తెలియదులే)..ఇలా రెండు రోజులు ఎందుకు జరుపుతారు? ఏమిలేదు..రోహిణి నక్షత్రం,అష్టమి రెండు ఒకటే రోజు రాకపోవాచు అందుకే అలా....పండుగ లో ముందు రోజు కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అంటారు...ఆ తరవాతి రోజు కాలాస్టమి.
కృష్ణుడి జీవితం నుండి మనం చాలా నేర్చుకోవచ్చు...దొంగతనం,కొంటెతనం కాదు..మచ్చుకకి కొన్ని చెప్తాను(అంటే చెప్పుకుంట పోతే...టైం సరిపోదు).చిన్నప్పుడు వెన్న దొంగతనం చేసేవాడు స్నేహితులతో కలిసి..దేవుడు అంటారు కదా.మరి వెన్న కావాలి అని తలచుకుంటే చాలు..మరి దొంగతనం ఎందుకు(పబ్లిసిటీ కోసం అనుకుంటున్నారా..కాదు బాబోయ్ కాదు)..ఇక్కడ మనకి ఎం చెప్పదలుచుకున్నాడు అంటే చేసే పని ఏదైనా టీం వర్క్ తో చేస్తే..ఏదైనా సాదిన్చవచ్చు అని..అది మనకు చిన్న దొంగతనం లాగ కనపడ్తుంది..కాని అలా ఫ్రెండ్స్ తో కలిసి ప్లాన్ చేసి వెన్న కుందని సాదించడం అంటే,మనకి టీం వర్క్ ఎలా ఉండాలో నేర్పుతునట్టే కదా..అందరితో కలిసిపోవటం,అందరిని గైడ్ చెయ్యడం..ఇలా చాలా నేర్చుకోవచ్చు..కృష్ణుడు ఒక డీల్ మేకర్ ఎలా ఉండాలో కూడా చూపించాడు...ఏదన్న పని చేపించాలి అంటే ఎలా ఒప్పించాలి..వాక్ చాతుర్యం ఎలా ఉండాలి..నొప్పించకుండా తప్పులు ఎలా చూపాలి...వగైరా వగైరా....మనకి మనపై నమ్మకం(కాన్ఫిడెన్సు) ఎలా ఉండాలో కూడా చెప్పకనే చెప్పాడు..చిన్నప్పుడు పెద్ద పెద్ద పనులు చేసి..అంటే మరీ మేతి మీరిన నమ్మకం పెట్టుకోమని కాద్ఫు..నీకు అవ్తుంది అంటే(నీవు ఆ పని చెయ్యగలవు)..ఆలోచించాల్సిన పనిలేదు చేసెయ్యాలి అలా...
కృష్ణుడి దగ్గర స్నేహం గురుంచి కూడా నేర్చుకోవాలి.కుచేలుడు,శ్రీ కృష్ణుడు చిన్నపాటి స్నేహితులు కదా..కలిసి చదువుకున్నారు...కుచేలుడు పెళ్ళయ్యాక...చాలా పేదవాడిగా జీవించాడు.తనకి సహాయం చెయ్యమని అడుగుదామని శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి అడగలేకా..అలాగే తిరిగివేల్లిపోయాడు..అది ముందే గ్రహించి.అతనికి సహాయం చేసి..తన స్నేహధర్మాన్ని చూపించాడు..మీకు తెలుసా..దశావతారాల్లో మిగిలిన ఏ అవతారానికి జగద్గురువుగా ప్రస్తుతి లభించలేదు..ఒక్క ఏ శ్రీకృష్ణ అవతారానికి తప్ప...ఎందుకో తెలుసా..ప్రపంచ ఖ్యాతి గడించిన..భగవద్గీత..భోదించి ప్రపంచానికే గురువుఅనిపించుకున్నాడు..అందుకే 'కృష్ణం వందే జగద్గురుం' అన్నారు..
ఇవన్ని నమ్మాలో లేదో తెలియదు కాని మనము చాలా నేర్చుకోవచ్చు..దీని బట్టి ఏమీ తెలుస్తుంది?..మన పూర్వికులు ఎంతగా ముందుచూపు గలవారో అందుకే అన్ని మనకి ఇలా పురాణాల రూపంలో అందించారు..
No comments:
Post a Comment