శుభోదయం....

Thursday, September 16, 2010

గుడ్డు మార్నింగు ......వినాయకుడి సంబరాల్లో మినిగిపోయారు అందరు..కదా...చిన్నప్పుడు భలే అనిపించేది..ఉదయాన్నే లేవడం...నాన్నగారి వెంట పూజ సామాగ్రి కొనటానికి వెళ్ళడం..అక్కదేకేల్లక మారాం చెయ్యడం..పెద్ద విగ్రహం కొను..నా ఫ్రెండ్స్ కి చెప్పాలి అని..అందరికంటే పెద్ద విగ్రహం ఉండాలి అని...అప్పుడు నాన్న బుజ్జగించడం....ఏదో ఒకటి వేరేది కొనివ్వడం..అలా....ఇంటికొచ్చాక పూజ ఎప్పుడూ అవ్తడా ఎప్పుడూ ఆ ఉండ్రాళ్ళు తిందామా అని చూడటం..(చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా అదే పరిస్తితి).
     మనకి తెలిసినంత వరకు వినాయకుడు శివపార్వతుల ముద్దుల కొడుకు...చదువుకి,జ్ఞానానికి,అవరోధాలు రాకుండా..మనము ఎక్కువ మొక్కుకుంటాము.మీకు తెలుసా..వినాయకుడిని పూజ చేస్తే అష్ట సిద్ధులు అందిస్తాడని అంటారు.అవి ఏంటి అంటే...నిరాడంబరత,కళా నైపుణ్యం,అధికారం,సూక్ష్మ ద్రుష్టి,విద్యా,ప్రణాళిక,కార్యసాధన.

       అసలు వినాయకుడిని మాములుగా చూడడం అంటే దేవుడు అన్న భక్తీతో కాకుండా ఏంటో తెలుసుకుందాం...
 గణపతి రూపం..పెద్ద పొట్ట,చెవులు చాట లాగ..ముఖ్యంగా ఏనుగు మొఖం,చిన్న కళ్ళు,నోటికి అడ్డంగా తొండం...మరచిపోయా..అతనికి వాహనం..ఒక చిన్ని ఎలుక..గణపతి పెద్దగ మాట్లాడాడు(బాబోయ్ తొండం అడ్డు ఉంది అని కాదు..అక్కడికే వస్తున్నా...)..అలా అద్దం ఉంటె ఏంటి అంటే..తక్కువ మాట్లాడు,చాటంత చెవులు...చాట తెల్సా మీకు...మనం బియ్యంలో రాలు తీయడానికి వాడుతామే అలా...విన్న మాట్లల్లో..చెడుని తీసి మంచిని గ్రహించు అని...అంత పెద్ద పొట్ట..ఎందుకో తెల్సా? విన్నవి అలా వదిలేయకుండా...దాచుకొమ్మని.చిన్న కళ్ళు....బాహ్య ప్రపంచం మీద అనవసరమైన ఆస మాని...అవసరమైన దాని మీదనే..ని ద్రుష్టి పెట్టు అని...అర్ధమైందా? హిహిహి.గణపతి పూజ లో ఉపయోగించే పత్రి...అవి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
   అవును మరచిపోయ..అంత పెద్ద వినాయకుడికి ఇంత చిన్ని ఎలుక ఏంటి అనా....ఏమీ లేదు....కార్యసాధనకి కావలసింది..శక్తి యుక్తి..సౌకర్యాలు కాదు అని అంట.
      వినాయకుడు బ్రహ్మచారా? అవును అంటారు కొందరు..కాదు అంటారు కొందరు...దీనికి ఒకటి చెప్పారు...వినాయక చవితి చంద్రుడు హస్త నక్షత్రంలో ఉంటాదంట.చంద్రుడు అంటే మనస్సు.హస్తా అంటే చెయ్యి..చంద్రుడు హస్తా లో అంటే...మనసు మన చేతుల్లో ఉండటం..అంటే అప్పుడే అనుకున్న పని మీద జయం కలగటం.అదే కార్యసిద్ధి.అందుకే అది సిద్ధి అంట..బుద్ధి అంటే ఆలోచన...ఆలోచనలు అదుపులో ఉంటె కార్యసిద్ధి సాధ్యం అని...ఈ విదంగా..సిద్ధిబుద్ధిలను తన భార్యలుగా చూపి మనకి చెప్తున్నాడు అని అంటారు.

No comments:

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):