సృజన'గీతం' ఎవరికోసం ...నిజం తెలిసినా దాచటం ఎందుకోసం....
బ్లాగు లోకంలో నేను చిన్నవాడినే..కాని ఈ పోస్టు చూసిన తెలుగు బ్లాగు జనాలకి ఈ పాటికి అర్ధం అయ్యుంటుంది.అందరు అనుకుంటున్నారు భలే టాలెంట్ ఉంది వాడికి..భలే ఆడుకున్నాడు అని(ఆ చంటబ్బాయి కాదు కాదు పెంటబ్బాయి కూడా అదే అంటున్నాడు నాలో టాలెంట్ ఎవరు చూడట్లేదు అని..హిహిహి )..
నాకు తెల్సిన ఒకరు నాకు ఆ బ్లాగ్ చూయించారు..ఆ కథ చదివి నాకు కలిగిన చిరాకు మాటల్లో చెప్పలేము..పైగా వాటికి కింద కామెంట్స్ ని చూసి చెప్పలేనంత నవ్వుకున్న...ఎందుకు అనా నవ్వు? ఏమీ లేదు..ఆ కామెంట్స్ పెట్టినవలల్లో ఉన్నది చిన్న పిల్లలు కాదు అలా అని యంగ్ లేడీస్ అసలుకే కాదు..జీవితంలో ఎంతో కొంత అనుభవం సంపాదిన్చినవారే.అలా కామెంట్స్ పెట్టినవారు చాలా మంది ఒకటే కమ్యూనిటీ సభ్యులు.
కొంచం అలోచించి ఉంటె వీలు ముందే జాగ్రత్త పడేవారు.నేను చూసిన మొదటి కథ వాడి ఫ్రెండ్ వాళ అక్క వాడి కాబోయే పెళ్ళానికి అలా చెయ్యటం...యాక్....రెండు..వాడి కాబోయే పెళ్ళాం ఎప్పుడూ గాల్లోనే అని..అంటే తన అంత గొప్ప జాబు ఎవరికీ లేదు అలా...మళ్లి ఇంకొకటి వాడికి ప్రపంచంలోనే ప్రఖ్యాత ఎక్కాల శాస్త్రం(గణిత శాస్త్రం)లో ఎంతో పేరున్న ఎవరో ప్రోఫ్ఫెస్సర్ అటా వీడ్ని అక్కడ University De Paris లో ప్రసంగించమని పిలిచారట...హహహ అక్కడ కొందరికి అలా అని వాడి కాబోయే పెళ్ళాం ఆ డాకుమెంట్స్ మెయిల్ చేసింది.అందులో ఇక్కడ పెడ్తున్న చూడండి.
పైన చూసారా ....ఆ యూనివర్సిటీ లోగో..చూసారా...ఎక్కడన్నా అంత దరిద్రమైన లోగో ఉంటుందా అంటే అది చిన్నగా ఉంటె బాగుండేదేమో..ఆ లోగోని మరీ పిచ్చిగా పెద్దగ చేసి అలా పెట్టాడు ..మన దేశంలో కూడా ఇంతకంటే బక్వాస్ లోగో ఉందని నిరూపించగల్గుతార? ..ఇది చూసే చెప్పొచ్చు..ఇంకొంచం తెలివున్న వారికి ఆ పెద్దాయన అంటే ఆ నోబెల్ అవార్డు గ్రహీత మెయిల్ id చూసారా...అది ఆ paris university నుండి కానకుండా..michigan state university నుండి ఉంది...ఇంకో విషయం కూడా ఎవరు ఆలోచించలేదా అనిపించింది...ఇవాళ రేపు మన మీడియా ఏమీ తక్కువ తినలేదు...ఇలా ఒక ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు ఇలా ఒకల్ని పిలిచాడు అంటే...అది ఎంత పెద్ద న్యూస్ చేసి చూపిస్తారో అందరికి తెలిసిన విషయమే.
కాని ఇక్కడ ఆలోచించాల్సింది ఒకట్టుంది ..అది ఏంటి అనా ..వాడు టార్గెట్ చేసింది ఆలోచనలో బలహీనమయిన వ్యక్తుల్ని.వారి మనోభావాలకి తగట్టుగా రసవత్తరమయిన కథ నడిపించాడు.ఇంకో విషయం ఇక్కడ వాడు టార్గెట్ చేసింది ఒక స్త్రీల కమ్యూనిటీని.
ఎపుడన్నఆలోచించారా..వాడు ఆ కమ్యూనిటీని ఎందుకు ఎంచుకున్నాడు అని?..
ఆ కమ్యూనిటీ వారు ఎందుకు అలా నమ్మారు?..ఒకటి ఎవరన్న వాళ్ళని ఈ కమ్యూనిటీకి పరిచయం చేసుండాలి...ఇది తప్పితే వేరే ఆప్షన్ లేనేలేదు.ఇక్కడ ఈ కమ్యూనిటీలో కూడా అదే జరిగింది.ఈ కమ్యూనిటీ లీడర్ అట పరిచయం చేసింది,,ఇది వాడే తన బ్లాగ్లో చెప్పాడు.
అసలు ఇదంతా బయటపడేది కాదు వాడు తన కథలో ఒక పాత్రని చంపకపోతే.ఇలా చనిపోయింది అన్న వెంటనే..నా ఫ్రెండ్ ఒకరు చూడు ఇలా చనిపోయిన్దంట అన్నారు..ఎలా అని అడిగాను..appendicitis అదే నేను చినప్పుడు విన్న 24 గంటల నెప్పి అని...అది వస్తే తను అక్కడ డబ్లిన్ లో చికిత్స చేయించుకుంటే అది కాస్త తిరగబడి..ఇండియాకి వచ్చాక చనిపోయారని అలా అన్నారంట...హిహిహి..నిజంగా ఎలా నమ్మాలి..ఎలా నమ్ముతారు ఈ మాట? ఆ చికిత్స చెయ్యకపోతే చనిపోతారు కాని చేస్తే కూడా చనిపోతారు అని ఇదే మొదటి సారి విన్న అది కూడా బయట ఆసుపత్రిలలో.
ఇది తెలిసి ఆ కమ్యూనిటీ లీడర్ అయ్యో పాపం చనిపోయింది అని ఆమె పిక్చర్ పెట్టి సానుభూతి చెప్పారు(అప్పటికే ఆవిడ ఆ అమ్మిని కలిసినట్టు అలా బొగట్ట )..తీర ఎవరో ఆ ఫోటో చూసి ఈ అమ్మాయి బతికే ఉంది అలా ఎలా అని...ఆ అమ్మాయి యూరోప్ లో ఎక్కడో ఉంటుంది..అది ఆ అమ్మాయి తన ఆరవ ఏటనే అక్కడి వెళ్ళిపోయింది..హిహిహి..మరి ఈ కమ్యూనిటీ లీడర్ అలా ఎలా చెప్పిందో తెలియకుండా..తనని కలిసినట్టు?..అంటే ఆ లీడర్ అబద్దం ఆడినట్టే కదా?....తర్వాత ఆ అమ్మాయి లేదు అన్నారంట..హిహిహి..ఎన్ని అబద్దాలు ఆడారో ..అయిన ఇవేమీ సందేహాలు తెప్పించలేదు చాలా మందికి ఆ కమ్యూనిటీలో..
ఆ కమ్యూనిటీలో చాలా మంది బాధపడ్తుంటే ...ఏమీ చెయ్యలేమా అని అనుకుంటుంటే..అదిగో నేను కనుకుంటున్న ..అదిగో దొరికేస్తాడు ఇదిగో దొరికేస్తాడు అని ఊరించి..ఆఖరికి నాకు వేరే పని లేదా నాకు ఉన్నవి రెండే చేతులు..వాడు పిచ్చోడు అంట వదిలెయ్యండి అని అలా అన్నారని విన్నాను.
ఒకటి చెప్తాను..అలా పిచ్చోళ్ళు ఉన్నారని అందరు రోడ్ల మీద వదులుతున్నారా? చికిత్స అయితే చేపిస్తున్నారు కదా..అలా వీడికి ఎందుకు చెయ్యకూడదు చికిత్సా?
వీడు పిచ్చోడు అని ఎలా అన్నారు?
ఒక స్త్రీ అయ్యి ఉండీ..తన కమ్యూనిటీలో ఉన్న తన సన్నిహితులు(అంటే ఆమె అలా చెప్పుకోవచ్చు) మనోభావాలు దెబ్బతింటే..పోనీయండి వదిలెయ్యండి అలా...మరి కనుక్కుంటున్న అని ఎందుకు చెప్పడం?
తప్పు చెయ్యనప్పుడు ఎందుకు బయపడటం(వాడి చిరునామా తెలిసినా చెప్పకపోవటానికి కారణం?)...అంటే ఏదన్న తప్పు చేసి ఉండాలి? కాదంటారా? ..
అంత రహస్యం ఏమీ ఉంటుంది వాడి చిరునామా దాపెట్టే అంత?
మిగాతవాలు మనుషులు కారా..అది కూడా ఆడవారు..ఎంత ఫీల్ అయ్యి ఉంటారు? తను స్త్రీనే కదా...ఎందుకు దాచుతున్నారో ఆమెకి లేదాపిచ్చోడికే తెలియాలి మరి...అంత భయం లేకపోతే ఇప్పటికన్నా ఆ మిగతా కమ్యూనిటీ సభ్యులకి వాడి చిరునామా చెప్పొచ్చు...లేకుంటే భాదపడేది తను కాదు కదా...నాకేంటి ఏమీ కాలేదు మనకెందుకు అని అనుకుని ఉండొచ్చు.
అసలు ఈ కమ్యూనిటీలో ఐక్యత లేనే లేదు...అంటే అది కూడా ఆ లీడర్ వల్లనే అని అర్ధం అవుతుంది..అన్ని సక్రమంగా చెప్తే బాగానే ఉంటుంది..చెప్పకపోవడం పైగా తను ఈ నెట్ తన సామ్రాజ్యం అనుకునే ఒక నియంత(నీవెంత) అనే తరహా...
ఇంకోటి ఆ పిచ్చోడు తప్పు చేసి మరీ సమర్దిన్చుకుంటున్నాడు..ఎందుకు అంత ఇది?..ఏమీ చూసుకొని...మాములుగా ఎవరైనా భయపడతారు..కాని వీడు అలా కాదు...ఇంక రేచాకోట్టాడు..అంటే వీడికి ఆ కమ్యూనిటీ లీడర్ సపోర్ట్ ఉంది అంటే తన గురుంచి ఎవరికీ చెప్పదు అనే ధీమా కదా?
చాలా మంది దగ్గర విన్నాను..తను ఫేక్ బ్లాగర్స్ ని సృష్టించి ఇలా నిజం మాట్లాడిన వారి మీద బురద జల్లుతారని..నాకేమి భయం లేదు..నేను నిజం మాట్లాడాను...నేను చిన్నవాడ్ని అయిన నాలుగు ఆకులు ఎక్కువే చదివాను..ప్రతీ ip మోనిటర్ అవుతూనే ఉంటుంది .పైగా ఇంకో కొన్ని రోజులలో వాడు దొరుకుతాడు..ఆల్రెడీ వేట ప్రారంభం అయ్యింది..ఈ లోపు అడ్రస్ చెప్పుకునేస్తే సరి..లేకపోతే భంగపాటు ఎటు తప్పదు.తర్వాత మీ పరీస్థితి ఏంటో..అప్పుడు వచ్చే పుబ్లిసిటీ ఏంటో..మీకే తెలుస్తుంది..కాని అలా బురద జల్లాలని చూసే వాళ్ళని నేను కూడా పిచ్చోల్లలాగే చూస్తాను...అదొక రకం పిచ్చి.. అలాంటి వాళ్ళు నిజాన్ని ఒప్పుకోలేరు.అదొక మానసిక సమస్య ...అందుకే అలా చేస్తుంటారు..వేరే ఏమీ పని లేక..
ఇంతకి ఈ సృజన అనే పేరుతో కమ్యూనిటీ సభ్యులతో చాట్ చేసింది ఎవరు నిజంగా వాడేనా? లేక ఆ క్యారెక్టర్ సృష్టించి వాడి చేతా..ఇంక ఈ కమ్యూనిటీలో వారి మీద నిఘా కోసం వాడారా?
నిజం చెప్పడానికి భయమెందుకు...తప్పు చెయ్యనప్పుడు..