లోకాలు తిరిగిన బిచ్చాచార్య దొరకనట్టు...ఏంటో..!

Saturday, January 29, 2011


"శనివారం కదా...వీక్ఎండ్ అని మంచిగా రెస్ట్  తీసుకుందాము అనుకున్న..కాని శనివారం కదా..నా భక్తులు ప్రొద్దున నుండి ఊపిరి ఆడానీయకుండా పూజలు అభిషేకాలు ..ఎవరికీ చెప్పాలండి నా భాధా....ఇప్పుడు ఏదో కొంచం ఫ్రీ టైం దొరికింది అని అలా చిన్న కునుకు తీద్దాం అంటే నువ్వేంటి నారదా ఇలా వచ్చావేమిటి" అన్నాడు హరి."నారాయణ నారాయణ ...క్షమించాలి క్షీరసాగర నివాస ..ఇటుగా వెళ్ళుతూ ..మీకు మీ బ్లాగు భక్తుల  విన్నపం ఒకటి సమర్పిద్దాం అని..""మొన్న బ్లాగు లోకంలో సంచరిస్తుంటే మీ బ్లాగు భక్తులు నన్ను పట్టుకొని వాడెవడో బిచ్చాచార్య  అట మీ భక్తులని  బాగా నొప్పించాడు.. వాడిని బయటకి లాగే మార్గమే లేదా అని నన్ను పట్టుకున్నారు..ఏది చెప్పిన వినలేదు..ఆఖరికి ఆ శ్రిమన్నారయుడిని  కనుక్కుని వస్తే అంటే కాని వదలలేదు..కలికాలం..మరల రానేమో అని నా తంబురా వాళ్ళ  దగ్గర అట్టి పెట్టుకుని ఈ దిక్కుమాలిన గిటార్ అంటకట్టారు .పరిష్కారం చెప్పి నా తంబురా తీస్కోవాలంట...ఈ గిటార్ వాయించలేక నా భాద నీతో కాక ఎవరితో చెప్పుకోను ..వారికి పరిష్కారం చూపించి నాకు నా తంబురా ఇప్పుంచు నారాయణ" అన్నాడు నారదుడు.
    
 "అదిగో వాడు బ్లాగులోకంలో నుండి తప్పించుకొని భూలోకంలో తిరుగుతూ ఉన్నాడు కదా..ఆహా ఎంత మహదానందంతో ఉన్నాడు ..పాట కూడా పాడుకుంటున్నాడు....వాడు ఇప్పుడు పాడే ఆ పాటలోనే ఉంది నారద వాడిని ఎలా బయటకి లాగలో..విను విని అలోచించి వారికి చెప్పు". అని హరి పరిష్కారం చెప్పాక చెప్పాడు..నారదుడు అయోమయం ముఖం పెడితే హరి తన చేతిలో ఉన్న రిమోట్ తో భూలోకం ఛానల్ పెట్టాడు తన కొత్త LED టీవీలో ... అప్పుడే ఒక కమర్షియల్ అయ్యి పాట స్టార్ట్ అవ్వబోతుంది...నారదుడు lays చిప్స్ పెట్టుకొని చూస్తున్నాడు....

***********************************************************

 హే హే హే హే హే హే హే హే.. రు రు రు రు రు రూ రు రూ..


పనిపాట యెటూలేదు బ్లాగుఅన్న రాస్తా బ్రదర్‌

పనిపాట యెటూలేదు బ్లాగుఅన్న రాస్తా  బ్రదర్‌
తెలుగుబ్లాగు లోకంలో చెప్పలేనివి అన్నీ  నావే  బ్రదర్‌

ఇంటర్నెట్ ప్రపంచంలో అబద్ధం కూడా నిజంలాంటిదే బ్రదర్‌
||పనిపాట||
నా బ్లాగులో రోల్స్  పిచ్చ రోల్స్   వాటికి జీవం నా ఊహలు
నా కంప్యుటర్  చెత్తడబ్బారా తమ్ముడూ

నా కీర్తి ఎవెరెస్ట్ కొండ అనుకునేరురా

||నా బ్లాగు||

నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని  నవేల్స్ చేత పుచ్చుకొని ఇంటర్నెట్ కి  చేరినాను  బ్లాగు బ్లాగు అంటున్నాను

బ్లాగులోక్కాన్ని  పాలించాలనే  చెత్త  ఆలోచన నాది  బ్రదర్‌

||పనిపాట||

క్యారెక్టర్లు అన్నీ నావి  చేత్తబ్లాగులు అన్నీ  నావి

ఎలుగెత్తి  చాటుతానురా  బ్లాగుల్లో  అమాయక జనాలని  ఆడిస్తానురా

ఈ జనాలని మోసం చెయ్యడం నా తప్పా

ఈ జనాలని మోసం చెయ్యడం నా తప్పా

నా కళతో ఆడించడం  నా తప్పా

నా కళతో ఆడించడం నా తప్పా


నన్ను మీకు పరిచయం చేసిన మీ లీడర్ని అడగండి   బ్రదర్‌
గట్టిగ అడిగితే నిజం బయటకి వస్తుంది బ్రదర్

||పనిపాట||
'ప్రియ'మైన'సృజన'గీత  చేత్తపురుగులం  ఊహాలోక  బానిసలం


'వన లీడర్'తో నడిపించే కథ నాదిరా  తమ్ముడూ నిజమోప్పుకోవడం చాలా  బరువురా

బ్లాగులో తప్ప వినేదిక్కులేదు  బయటేమో సత్తా లేదు

అన్నమో రామచంద్రా అంటే పెట్టేదిక్కేలేదు

ఈ 'వనం'లో వాళ్ళదే  భారమని తెంపు చేయరా బ్రదర్‌
***************************************************************

మళ్లి కమర్షియల్..టీవీ ఆపేసాడు నారాయణుడు.నారదుడి వంక చూసి.."ఏమీ నారద నీకు కావలసింది దొరికినదా..నేను కొంచంసేపు  కునుకు తీయోచ్చా",నారదుడు మొఖము వెయ్యి వోల్టుల బుల్బ్ లాగ వెలిగిపోయింది..."నారాయణ నారాయణ....నా తంబురా నాకు ఇప్పించావు తండ్రి"...అంటూ  బ్లాగు లోకానికి పయనమయ్యాడు.

పరిష్కార దిశలో ఒక పసి మనస్సు

Friday, January 28, 2011

  పోయిన సండే టైమ్స్ పేపర్ చదువుతూ ఒక ఆర్టికల్ దగ్గర ఆగాను...మీనాక్షి అని ఒక లేడీ రాసారు..అది ఏంటి అంటే ..
 చిన్నప్పటి నుండి వాళ్ళ ఇంట్లో ఒక పనిమనిషి జయ అని, పనిచేసేది..వచ్చి తన పని తానూ చేసుకొని..ఎమన్నా పెడ్తే తిని మళ్లి సాయంత్రం పనికి వచ్చేదంట.అలా రోజులు గడిచేకొద్దీ మీనాక్షికి పెళ్లి అయ్యి ఈ మధ్యనే తనకి పాప పుడితే పుట్టింటికి వచ్చిందంట.సో ఇప్పటికీ ఆ జయనే కాకపోతే ఇప్పుడు నానమ్మ అయ్యింది అని..ఇప్పుడు రోజు తన మూడేళ్ళ మనవరాలు అమృత తనతో పాటు వస్తుంది...జయ పని చేసుకునే అంత వరకు కుర్చుని మళ్లి తనతో ఆ అమృత వెళ్ళిపోతుంది...నాయనమ్మ పని చేసుకునే అంత సేపు అమృత తన తోటి పిల్లలలాగ అల్లరి చెయ్యకుండా బుద్ధిగా ఒక పక్కన కూర్చుని ఉండేది.
       ఒకసారి మీనాక్షి కూతురు రెండు నెలలు ఉన్నపుడు అమృత తన గది వైపు వచ్చి తన కూతురుని చూసి బయట నుండి తెగ ముచ్చటపడటం లోపలి రమ్మంటే రాలేదంట.ఇలా రోజు వచ్చి తన కూతురుని చూసి బయటనుండే సంబరపడి అలాగే ఉండేదంట జయ వచ్చే వరకు.ఒకరోజు అమృత,మీనాక్షిని తను ఆ చిన్ని పాపని ముట్టుకోవచ్చ అని అడిగితే, మీనాక్షి లోపలి వచ్చి ఆడుకో పాపతో అన్నదంట.అలా లోపలికి వచ్చి పాప ని ముట్టుకొని తెగ ఆనందపడేది..రోజు అలా పాపతో ఆడుకునేది అమృత.ఒక రోజు జయ పని అయిపోయాక తీసకేల్లటానికి వస్తే అమృత జయని "ఆ చిన్న పాప చాలా తెల్లగా ఉంది మరి నేను ఎందుకు ఇంక నల్లగా ఉన్నాను" అని అడిగింది.జయ అమృతని అక్కడనుండి తిసుకేల్లిపోయిందట  ...అలా కొన్ని రోజులు అమృత కనపడలేదు..తర్వాత ఒకరోజు అమృత వచ్చి అలా చూస్తుంటే..లోపలి రమ్మంది మీనాక్షి..వచ్చాక అమృత గది అంత చూస్తూ ఒక క్రీం ని చూపించి అది తీస్కోవచ్చా అని అడిగింది.మీనాక్షి కొంచం ఆశ్చర్యపడి ఎలాగో అది కొద్దిగే ఉంది కదా..సరే తీస్కో అంది.అది చిన్న పిల్లలకి రాసే క్రీం.జయ వచ్చి ఎందుకు తీస్కున్నావ్ అది ఇచేయ్ అంటే మీనాక్షి నే ఇచ్చింది అనట్టుగా చెప్పిందంట..అయిన ఇచ్చేయ్ అంటే.. "అది రాసుకొని నేను తెల్లగా ఐతే ఇంట్లో అబ్బాయి కావాలని లేదా  తెల్ల అమ్మాయి కావాలని గోడవపడరు కదా అమ్మ,నాన్న"అని అంటుంది.మీనాక్షి చాలా బాధపడి ఇంక ఈ లింగ వివక్ష,వర్ణ వివక్ష నడుస్తున్నాయా అని...తను తన భర్త కలిసి మాట్లాడుకొని..అమృత చదువు బాధ్యతలు తీస్కున్నరాన్ట..
                బాగుంది కదండీ....ఇది చదివి చాలా మంది ఒకటే అనుకుంటారు అవును పాపం అమృత...మీనాక్షి మంచిపని చేసింది...ఇలా...కాని నాకు ఏమనిపించింది అంటే ఫ్రాంక్ గా చెప్పాలి అంటే నాకు అమృత ఆ చిన్న పాపని చూస్తూ పడ్డ ఆ ఆనందం...ఆ పాపని పట్టుకుని పడ్డ సంబరం..ఆ కళ్ళల్లోని ఆనందం...చాలా బాగా అనిపించింది...ఆ అమాయకమైన మనస్సు ఎంత గాయపడిందో అని తల్చుకున్నాను వాలింట్లో గొడవ పడ్తున్నారంటే. ఇవాళ రేపు ఈ లింగ వివక్ష తక్కువైంది..కాని మొగుడు పెళ్ళాల గొడవలు పిల్లల మీద ప్రభావం చూపిస్తున్నాయి అనడానికి ఇదే నిదర్శనం.
           కాని మా గురువుగారికి ఇంకోల వచ్చింది ఆ ఆలోచన...ఇక్కడ నేను కూడా అది గమనించలేదు..ఈ ఆర్టికల్ గురుంచి చర్చ జరిగేటప్పుడు మా గురువుగారు అన్నారు...ఆ పిల్ల సమస్యకి పరిష్కారం భలే ఆలోచించింది అని..అంత చిన్న వయస్సులో తను తన ఇంట్లో జరిగే గొడవకి పరిషారం ఏంటా అని అలోచిన్చిందంటే..ఆ వయస్సులో తనకున్న ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్ల్స్ రేపు ముందు ముందు తనని ఎంత గొప్ప స్థానానికి  చేరుతుందని...
మీనాక్షి ఇంక వాళ భర్త  తనని చదివిస్తున్నందుకు తను వాళ్ళ  నమ్మకాన్ని వమ్ము చెయ్యదు ...తన ఇంట్లో వాళ్ళే కాదు తనని చదివించిన వాళ్ళు కూడా గర్వపడేటట్టు చేస్తుంది అని ఆశిస్తూ....

సృజన'గీతం' ఎవరికోసం ...నిజం తెలిసినా దాచటం ఎందుకోసం....

Thursday, January 27, 2011

సృజన'గీతం' ఎవరికోసం ...నిజం తెలిసినా దాచటం ఎందుకోసం.... 
    బ్లాగు లోకంలో నేను చిన్నవాడినే..కాని ఈ పోస్టు చూసిన తెలుగు  బ్లాగు జనాలకి ఈ పాటికి అర్ధం అయ్యుంటుంది.అందరు అనుకుంటున్నారు భలే టాలెంట్ ఉంది వాడికి..భలే ఆడుకున్నాడు  అని(ఆ చంటబ్బాయి కాదు కాదు పెంటబ్బాయి కూడా అదే అంటున్నాడు నాలో టాలెంట్ ఎవరు చూడట్లేదు అని..హిహిహి  )..
నాకు తెల్సిన ఒకరు నాకు ఆ బ్లాగ్ చూయించారు..ఆ కథ చదివి నాకు కలిగిన చిరాకు మాటల్లో చెప్పలేము..పైగా వాటికి కింద కామెంట్స్ ని చూసి చెప్పలేనంత నవ్వుకున్న...ఎందుకు అనా నవ్వు? ఏమీ లేదు..ఆ కామెంట్స్ పెట్టినవలల్లో  ఉన్నది చిన్న పిల్లలు కాదు అలా అని యంగ్ లేడీస్ అసలుకే కాదు..జీవితంలో ఎంతో కొంత అనుభవం సంపాదిన్చినవారే.అలా కామెంట్స్ పెట్టినవారు చాలా మంది ఒకటే కమ్యూనిటీ సభ్యులు.
  కొంచం అలోచించి ఉంటె వీలు ముందే జాగ్రత్త పడేవారు.నేను చూసిన మొదటి కథ వాడి ఫ్రెండ్ వాళ అక్క వాడి కాబోయే పెళ్ళానికి అలా చెయ్యటం...యాక్....రెండు..వాడి కాబోయే పెళ్ళాం ఎప్పుడూ గాల్లోనే అని..అంటే తన అంత గొప్ప జాబు ఎవరికీ లేదు అలా...మళ్లి ఇంకొకటి వాడికి ప్రపంచంలోనే ప్రఖ్యాత  ఎక్కాల శాస్త్రం(గణిత శాస్త్రం)లో ఎంతో పేరున్న ఎవరో ప్రోఫ్ఫెస్సర్ అటా వీడ్ని అక్కడ University De Paris లో ప్రసంగించమని పిలిచారట...హహహ అక్కడ కొందరికి అలా అని వాడి కాబోయే పెళ్ళాం ఆ డాకుమెంట్స్ మెయిల్ చేసింది.అందులో ఇక్కడ పెడ్తున్న చూడండి.
     పైన చూసారా ....ఆ యూనివర్సిటీ లోగో..చూసారా...ఎక్కడన్నా అంత దరిద్రమైన లోగో ఉంటుందా అంటే అది చిన్నగా ఉంటె   బాగుండేదేమో..ఆ లోగోని మరీ పిచ్చిగా పెద్దగ చేసి అలా పెట్టాడు ..మన దేశంలో కూడా ఇంతకంటే బక్వాస్ లోగో ఉందని నిరూపించగల్గుతార? ..ఇది చూసే చెప్పొచ్చు..ఇంకొంచం తెలివున్న వారికి ఆ పెద్దాయన అంటే ఆ నోబెల్ అవార్డు గ్రహీత మెయిల్ id చూసారా...అది ఆ paris university నుండి కానకుండా..michigan state university నుండి ఉంది...ఇంకో విషయం కూడా ఎవరు ఆలోచించలేదా అనిపించింది...ఇవాళ రేపు మన మీడియా ఏమీ తక్కువ తినలేదు...ఇలా ఒక ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు ఇలా ఒకల్ని పిలిచాడు అంటే...అది ఎంత పెద్ద న్యూస్ చేసి చూపిస్తారో అందరికి తెలిసిన విషయమే.
  కాని ఇక్కడ ఆలోచించాల్సింది ఒకట్టుంది ..అది ఏంటి అనా ..వాడు టార్గెట్ చేసింది ఆలోచనలో బలహీనమయిన వ్యక్తుల్ని.వారి మనోభావాలకి తగట్టుగా రసవత్తరమయిన కథ నడిపించాడు.ఇంకో విషయం ఇక్కడ వాడు టార్గెట్ చేసింది ఒక స్త్రీల కమ్యూనిటీని.
   ఎపుడన్నఆలోచించారా..వాడు ఆ కమ్యూనిటీని ఎందుకు ఎంచుకున్నాడు అని?..
ఆ కమ్యూనిటీ వారు ఎందుకు అలా నమ్మారు?..ఒకటి ఎవరన్న వాళ్ళని ఈ కమ్యూనిటీకి పరిచయం చేసుండాలి...ఇది తప్పితే వేరే ఆప్షన్ లేనేలేదు.ఇక్కడ ఈ కమ్యూనిటీలో కూడా అదే జరిగింది.ఈ కమ్యూనిటీ లీడర్ అట పరిచయం చేసింది,,ఇది వాడే తన బ్లాగ్లో చెప్పాడు.
  అసలు ఇదంతా బయటపడేది కాదు వాడు తన కథలో ఒక పాత్రని చంపకపోతే.ఇలా చనిపోయింది అన్న వెంటనే..నా ఫ్రెండ్ ఒకరు చూడు ఇలా చనిపోయిన్దంట అన్నారు..ఎలా అని అడిగాను..appendicitis  అదే నేను చినప్పుడు విన్న 24 గంటల నెప్పి అని...అది వస్తే తను అక్కడ డబ్లిన్ లో చికిత్స చేయించుకుంటే అది కాస్త తిరగబడి..ఇండియాకి వచ్చాక చనిపోయారని అలా అన్నారంట...హిహిహి..నిజంగా ఎలా నమ్మాలి..ఎలా నమ్ముతారు ఈ మాట? ఆ చికిత్స చెయ్యకపోతే చనిపోతారు కాని చేస్తే కూడా చనిపోతారు అని ఇదే మొదటి సారి విన్న అది కూడా బయట ఆసుపత్రిలలో.
ఇది తెలిసి ఆ కమ్యూనిటీ లీడర్ అయ్యో పాపం చనిపోయింది అని ఆమె పిక్చర్ పెట్టి సానుభూతి చెప్పారు(అప్పటికే ఆవిడ ఆ అమ్మిని కలిసినట్టు అలా బొగట్ట )..తీర ఎవరో ఆ ఫోటో చూసి ఈ అమ్మాయి బతికే ఉంది అలా ఎలా అని...ఆ అమ్మాయి యూరోప్ లో ఎక్కడో ఉంటుంది..అది ఆ అమ్మాయి తన ఆరవ ఏటనే అక్కడి వెళ్ళిపోయింది..హిహిహి..మరి ఈ కమ్యూనిటీ లీడర్ అలా ఎలా చెప్పిందో తెలియకుండా..తనని కలిసినట్టు?..అంటే ఆ లీడర్ అబద్దం ఆడినట్టే కదా?....తర్వాత ఆ అమ్మాయి లేదు అన్నారంట..హిహిహి..ఎన్ని అబద్దాలు ఆడారో ..అయిన  ఇవేమీ సందేహాలు తెప్పించలేదు చాలా మందికి ఆ కమ్యూనిటీలో..
   ఆ కమ్యూనిటీలో చాలా మంది బాధపడ్తుంటే ...ఏమీ చెయ్యలేమా అని అనుకుంటుంటే..అదిగో నేను కనుకుంటున్న ..అదిగో దొరికేస్తాడు ఇదిగో దొరికేస్తాడు అని ఊరించి..ఆఖరికి నాకు వేరే పని లేదా నాకు ఉన్నవి రెండే చేతులు..వాడు పిచ్చోడు అంట వదిలెయ్యండి అని అలా అన్నారని విన్నాను.
ఒకటి చెప్తాను..అలా పిచ్చోళ్ళు ఉన్నారని అందరు రోడ్ల మీద వదులుతున్నారా? చికిత్స అయితే చేపిస్తున్నారు కదా..అలా వీడికి ఎందుకు చెయ్యకూడదు చికిత్సా?
వీడు పిచ్చోడు అని ఎలా అన్నారు?
ఒక స్త్రీ అయ్యి ఉండీ..తన కమ్యూనిటీలో ఉన్న తన సన్నిహితులు(అంటే ఆమె అలా చెప్పుకోవచ్చు) మనోభావాలు దెబ్బతింటే..పోనీయండి వదిలెయ్యండి అలా...మరి కనుక్కుంటున్న అని ఎందుకు చెప్పడం?
తప్పు చెయ్యనప్పుడు ఎందుకు బయపడటం(వాడి చిరునామా తెలిసినా చెప్పకపోవటానికి కారణం?)...అంటే ఏదన్న తప్పు చేసి ఉండాలి? కాదంటారా? ..
అంత రహస్యం ఏమీ ఉంటుంది వాడి చిరునామా దాపెట్టే అంత?
మిగాతవాలు మనుషులు కారా..అది కూడా ఆడవారు..ఎంత ఫీల్ అయ్యి ఉంటారు? తను స్త్రీనే  కదా...ఎందుకు దాచుతున్నారో ఆమెకి లేదాపిచ్చోడికే తెలియాలి మరి...అంత భయం లేకపోతే ఇప్పటికన్నా ఆ మిగతా కమ్యూనిటీ సభ్యులకి వాడి చిరునామా చెప్పొచ్చు...లేకుంటే భాదపడేది తను కాదు కదా...నాకేంటి ఏమీ కాలేదు మనకెందుకు అని అనుకుని ఉండొచ్చు.
  అసలు ఈ కమ్యూనిటీలో ఐక్యత లేనే లేదు...అంటే అది కూడా ఆ లీడర్ వల్లనే అని అర్ధం అవుతుంది..అన్ని సక్రమంగా చెప్తే బాగానే ఉంటుంది..చెప్పకపోవడం పైగా తను ఈ నెట్ తన సామ్రాజ్యం అనుకునే ఒక నియంత(నీవెంత) అనే తరహా...
ఇంకోటి ఆ పిచ్చోడు తప్పు చేసి మరీ సమర్దిన్చుకుంటున్నాడు..ఎందుకు అంత ఇది?..ఏమీ చూసుకొని...మాములుగా ఎవరైనా భయపడతారు..కాని వీడు అలా కాదు...ఇంక రేచాకోట్టాడు..అంటే వీడికి ఆ కమ్యూనిటీ లీడర్ సపోర్ట్ ఉంది అంటే తన గురుంచి ఎవరికీ చెప్పదు అనే ధీమా కదా?
చాలా మంది దగ్గర విన్నాను..తను ఫేక్ బ్లాగర్స్ ని సృష్టించి ఇలా నిజం మాట్లాడిన వారి మీద బురద జల్లుతారని..నాకేమి భయం లేదు..నేను నిజం మాట్లాడాను...నేను చిన్నవాడ్ని అయిన నాలుగు ఆకులు ఎక్కువే చదివాను..ప్రతీ ip మోనిటర్ అవుతూనే ఉంటుంది .పైగా ఇంకో కొన్ని రోజులలో వాడు దొరుకుతాడు..ఆల్రెడీ వేట ప్రారంభం అయ్యింది..ఈ లోపు అడ్రస్ చెప్పుకునేస్తే సరి..లేకపోతే భంగపాటు ఎటు  తప్పదు.తర్వాత మీ పరీస్థితి  ఏంటో..అప్పుడు వచ్చే పుబ్లిసిటీ ఏంటో..మీకే తెలుస్తుంది..కాని అలా బురద జల్లాలని చూసే వాళ్ళని నేను కూడా పిచ్చోల్లలాగే చూస్తాను...అదొక రకం పిచ్చి.. అలాంటి వాళ్ళు నిజాన్ని ఒప్పుకోలేరు.అదొక మానసిక  సమస్య ...అందుకే అలా చేస్తుంటారు..వేరే ఏమీ పని లేక..
     ఇంతకి ఈ సృజన అనే పేరుతో కమ్యూనిటీ సభ్యులతో చాట్ చేసింది ఎవరు నిజంగా వాడేనా? లేక ఆ క్యారెక్టర్ సృష్టించి వాడి చేతా..ఇంక ఈ కమ్యూనిటీలో  వారి మీద నిఘా కోసం వాడారా?
నిజం చెప్పడానికి భయమెందుకు...తప్పు చెయ్యనప్పుడు..
 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):