Showing posts with label మహాభారతం. Show all posts
Showing posts with label మహాభారతం. Show all posts

మహాభారతం..మనకు తెలిసినది ఎంత?.....3...పురూరవుడు....

Wednesday, February 16, 2011

ఇలకు,బుధునికి పుత్రుడుగా జన్మించిన వాడు పురూరవుడు. చంద్రవంశంలో ప్రసిద్ధుడైనవాడు. .ఒకనాడు పురూరవుడు జలకాలడుతున్న ఊర్వశినీ చూసి ఇష్టపడ్డాడు. తనని పెళ్లి చేసుకోమని ఆమెను అడిగాడు. ఇతనితో జీవించడానికి ఊర్వశి రెండు షరతులు పెట్టింది.ఒకటి తనతో తప్ప మరెప్పుడూ అతడు ఎవరికి నగ్నంగా కనబడకూడదు. రెండవది తను  పెంచుకుంటున్న మేకలను కాపాడాలి అన్నది. ఈ రెండింటికీ పురూరవుడు ఒప్పుకున్నాడు. వారిద్దరూ ఎన్నో ఏళ్ళు సుఖంగా జీవించారు.చాలా మంది పిల్లలని కన్నారు. ఇల ఉంటె ఊర్వశి లేకపోతే ఇంద్రసభలో ఏమీ అంతగా లేకపోయేసరికి, ఇంద్రుడు ఆమెను తీసుకురావటానికి ఉపాయం చెప్పి, ఇద్దరు గంధర్వులను వాళ్ళదగ్గరికి పంపిస్తాడు.ఆ గంధర్వులు ఒక రాత్రిపూట పురూరవుడు ఊర్వశితో నిద్రిస్తుండగా , ఊర్వశి మేకలను తీసుకొని పారిపోయారు. అది గమనించిన ఊర్వశి పురూరవుడితో మేకలను ఎవరో తీస్కేల్తున్నారు నా మేకలు నాకు తెచ్చి ఇవ్వు.నా షరతులకి ఒప్పుకున్నావు వాటిని కాపాడలేవా అని అతడిని పంపింది.. వెంటనే బట్టలు కూడా  వేసుకోకుండానే ఆ మేకలను తీసుకురావడానికి పరుగెత్తాడు పురూరవుడు. రెండు షరతులలో విఫలం అయ్యాడు అని ఊర్వశి అతడిని వదిలి వెళ్ళిపోయింది.తరువాత కొందరు అంటారు పురూరవుడు పిచ్చివాడై ..అలా తిరుగుత ఏడుస్తూ ఉన్నాడని...కొందరు గందర్వుడుల మారాడు ఊర్వశి వెంట సంగీత కచేరీలు చేస్తూ ఉంటాడు అని..


విశ్లేషణ..
అప్స అనగా నీరు..అప్సరనీ జల దేవత అని కూడా అనొచ్చు...ఏ జలం భూమికి స్వర్గం నుండి వస్తుంది(వర్షం లాగా)..మళ్లి కొన్ని రోజులకి స్వర్గానికి వెళ్ళిపోతుంది(ఆవిరి లాగా)...జలం వల్ల జీవం వస్తుంది..పైన చెప్పినదానిలో అదే ఉంది...అప్సర అంటే ఊర్వశి(జలం),పురూరవుడు మనిషి (మనిషి నీటి కోసం పడే ఆరాటం). మళ్లి ఆకాశానికి(ఇంద్రుడు) వెళ్ళిపోతుంది జలం ఆవిరిలాగా...
  ఊర్వశి ఇల షరతులు ఎందుకు పెట్టింది అనా..వాటికి పురూరవుడు ఎందుకు ఒప్పుకున్నాడు?
      మన సమాజంలో(ఇప్పుడు కాదు పూర్వం)  స్త్రీకి ఒక  ముఖ్యమైన  స్థానం కల్పించారు...తన భర్తని తను సెలెక్ట్ చేసుకోవచ్చు..ఒక స్త్రీ వల్లే పురుషుడు వంశం పెంచి తన పూర్వికుల పాపాలను పోగ్గోట్టుతాడు ..

మహాభారతం..మనకు తెలిసినది ఎంత?.....2

Tuesday, February 15, 2011

                                   అసురులమీద దేవతలదే పై చేయి ఉండాలని ఎప్పుడూ యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి స్వర్గలోకంలో.వీటిని జరిపించే బాధ్యత బృహస్పతిది.అతని భార్య తార ,ఆ యజ్ఞాల సమయంలో అతనితో లేకుంటే ఆ యజ్ఞాలకి ఫలమే ఉండదు.ఎప్పుడూ పూజలలో ఉండే బృహస్పతి మీద చిరాకు పుట్టి ఒకరోజు తార చంద్రుని తో వెళ్ళిపోతుంది.బృహస్పతి దేవతలా రాజైన ఇంద్రుని వద్దకు వెళ్లి ఈ యజ్ఞాలు ఫలించాలి అంటే నా భార్యనీ నాకు ఇప్పించు అని అంటాడు.యజ్ఞ ఫలం లేకుంటే భూలోకం కూడా అతలాకుతలం అవుతుందని ఇంద్రుడు తారనీ బృహస్పతి దగ్గరకు వచేయ్యమని ఆజ్ఞాపిస్తాడు.ఇంక తారకి తప్పక బృహస్పతి దగ్గరకు వస్తుంది..కాని అప్పటికే తార కడుపుతో ఉంటుంది..దానికి బృహస్పతి,చంద్రుడు..ఇద్దరు ఆ పుట్టబోయే వానికి తండ్రి అని చెప్పుకుంటారు..తార ఏమీ చెప్పాక మౌనంగా ఉంటె కడుపు లోని బిడ్డ తన తండ్రి ఎవరో తనకి తెలియాలని తారని అడుగుతుంది.ఆ కడుపులోని బిడ్డ అడిగిన ప్రశ్నకు దేవతలంత హర్షించి...అతనికి బుధుడు అని పిలుస్తారు.ఆ బిడ్డ అడిగిన ప్రశ్నకి జవాబుగా తార..నీవు చంద్రుని కుమారుడివి..అని.అది విన్న బృహస్పతి కోపంతో..ఆ బిడ్డ ఆడా మగ కాని వాడిగా ఉంటాడని శపిస్తాడు. అలా బుధుడు పెరిగి పెద్దవాడవుతాడు.ఒకరోజు తార బుధుడునీ అడుగుతుంది..పెళ్లి చేసుకుంటావ అని..దానికి బుధుడు నన్నెవరు చేసుకుంటారు...భర్తగాన లెక భార్యగాన ?..అప్పుడు అతని తల్లి తార..అతని తండ్రి శాపానికి ఏదో ఒక కారణం ఉండకుండా ఉండదు..ఎవరో ఒకరు దొరుకుతారు చూడు అని.
  ఒక రోజు బుధుడు ఇల అనే ఆమెను చూసి  ప్రేమిస్తాడు...అసలు ఈ ఇల ఎవరు?
       ఇలా ఒకప్పుడు సుద్యుమ్న,మను రాజు కొడుకు.ఒకనాడు వేటకి వెళ్ళినప్పుడు ..ఆ అడవిలో శివుడు శక్తి తో ఉన్నప్పుడు..శక్తి కోరిక మేరకు అంటే ...శక్తి ఆ సమయంలో ఏ మొగ జంతువు కాని..మొగ మనిషి కాని ఆ అడవిలో ఉండకూడదు అంటే శివుడు అనుగ్రహం వల్ల ఆ అడవిలో అన్ని మొగ జంతువులు..పక్షులు అలా ఆడవిగా మారిపోయాయి..ఆ సమయంలోనే సుద్యుమ్న అక్కడే ఉండటం చేతా...ఆడామేగా మారిపోయాడు.అతడు వెళ్లి శక్తి సారాను కోరినప్పుడు..ఆ తల్లి...బయపడకు..శివుని మంత్రం నుండి నేను ఏమీ చెయ్యలేను కాని నీకు ఆ శాపం మారుస్తాను అని..చంద్రుడు తగ్గినప్పుడు నీవు స్త్రీ లాగా...పెరిగినప్పుడు పురుషునిలా ఉంటావు అని వరం ప్రసాదించింది.
      అలా..ఏ ఇల బుధుడుకి భార్యగా అయ్యింది.ఇద్దరికీ చాలా మంది కొడుకులు పుట్టారు.వీలందరూ చంద్రవంశీయులు అని పిలవబడ్డారు.(వీళ్ళు బుధుని పిల్లలు..బుధుడు అసలు తండ్రి చంద్రుడు.అందుకే చంద్రవంశీయులు పిలవబడ్డారు)

మహాభారతం..మనకు తెలిసినది ఎంత?.....1

Monday, February 14, 2011

                        మహాభారతం..ఇది వినగానే మనకి గుర్తుకువచ్చేది..పాండవులు,కౌరవులు,కృష్ణుడు..ఇంక యుద్ధం..ఇంతకంటే చాలా మందికి ఎక్కువగా తెలియదు.
                         అసలు భారతం ఎవరు రాసారు? మనకి తెలిసిన భారతం అదేనా?


  మనకి తెల్సి మనం వింటున్న భారతం..రాసింది  వ్యాసుడు.. కాదు..వినాయకుడు రాసాడు..కాని అది చెప్పింది మాత్రం వ్యాసుడే.అసలు ఈ వ్యాసుడు ఎవరు?....
     వ్యాసుడు అసలు పేరు "కృష్ణ ద్వైపాయన",ఇతని తల్లి ఒక జాలరి,తండ్రి పరాశరుడు,పరాసురుడు వశిష్ఠుడుని(సప్త ఋషులలో  ఒకడు) మనుమడు .ఈ సప్త ఋషులు మొదట వేదం విన్న వారు.ఈ కృష్ణ ద్వైపయనకు వేద వ్యాసుడని(వేదాలు విభజించి రాసాడు కాబట్టి)కూడా పేరు.
  ఈ మహాభారతంలో ఉన్నవారంతా వ్యాసుని మనుమలే.ఈ భారతం మొత్తం అరవై భాగాలుగా ఉండేదంట.అందులో ఒక భాగం మనకు తెలిసింది,అదీ వ్యాసుని శిష్యుడు వైసంపాయన ద్వారా తెలిసింది.మొత్తం కథ.... అనగా వ్యాసుడు వినాయకుడికి చెప్పింది ఎవరికి తెలియదు..ఈ ఒక్క భాగం తప్ప.అది ఎలా అంటే.
    వైసంపాయన ఈ కథ జనమేజయుని యజ్ఞ స్థలిలో చెప్పాడు..ఈ జనమేజయుడు పాండవ అర్జునుని మునిమనవడు.ఇలా చెప్పేటప్పుడు ఒక దాసరి రోమహర్షణ అనే అతను విని,ఇది తన కొడుకు ఉగ్రస్రావుడుకి వర్ణించాడు.అతడు నైమిష అరణ్యములో ఉన్నశౌనకాది మునులకి చెప్పాడు.
    వ్యాసుడు భారతాన్ని తన కొడుకు శుకుడుకి కూడా చెప్పాడు.ఇది శుకుడు పరీక్షిత్తుడికి చెప్పాడు.
    వ్యాసుని శిష్యులలో జైమిని అనే శిష్యుడు కూడా గురువు దగ్గర ఈ కథ విన్నాడు..కాని తనకి సందేహాలు ఎక్కువ ఉండేవి.తన సందేహాలను నివృత్తి చేసుకుందాము అనుకున్నాడు కాని ఆ సమయానికి వ్యాస మహర్షి లేడు.జైమిని మార్కండేయుని దగ్గరకు వెళ్ళాడు...కాని మార్కండేయుడు మౌన వ్రతంలో ఉన్నాడు..అప్పుడు మార్కండేయుని శిష్యులు జైమినిని ఒక నాలుగు పక్షులు ఉన్నాయి వాటి దగ్గరకు వెళ్ళు అవి చెప్తాయి అని పంపుతారు.(అవి ఏమీ పక్షులో నాకు తెలియదు :)...).ఈ నాలుగు పక్షుల దగ్గరికి ఎందుకు పంపారు? ఎందుకంటే ఇవి కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నాయంట.అది ఎలా అంటే..యుద్ధస్థలిలో వీటి తల్లి అలా ఎగురుతూ వెళుతుంటే ఒక బాణం వచ్చి ఈ పక్షికి తగులుతుంది.అలా తగిలినప్పుడు దీని కడుపులో ఉన్న నాలుగు గుడ్డులు కింద పడ్డాయంట.(కింద పడితే పగలవా అనొద్దు)..అవి ఎందుకు పగలలేదంటే..అది ఆ యుద్ద భూమి మొత్తం రక్తం తో నిండి ఉండీ..పగలలేదు అని..అలా పడ్డ గుడ్డల మీద ఒక ఏనుగు గంట పడి..అంటే వాటికి తగలకుండా..ఆ గుడ్డులు కాపాడబడ్డాయి అని.యుద్ధం అయిపోయినాకా కొందరు ఋషులు గంట కింద ఉన్న పక్షులని చూసి..ఇవి మనుషులకంటే యుద్ధం గురుంచి ఎక్కువ తెలుసుకున్నాయి అని వీటికి వాక్కు ప్రసాదించారని వినికిడి. ఈ పక్షులు జైమిని సందేహాలని చాలా వరకు తీర్చి ఇంక ఎవరికి తెలియనివి కూడా చెప్పాయి.
    అసలు వ్యాసుడు భారతానికి పెట్టిన పేరు 'జయ' అది కాస్త అలా నలుగురికి పాకుతూ 'విజయ' అయ్యింది.అలా అలా అయ్యి మొత్తానికి 'భారతం' అని పేరు తెచ్చుకుంది.(భారతం అని ఎందుకు వచ్చింది అంటే భారత వంశానికి సంబందించిన వారి గురుంచి కాబట్టి)
                                                                                                                                      (ఇంకా వుంది)
 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):