ప్రేమా..వ్యామోహమా..

Wednesday, September 22, 2010

ఈ మద్య మనం చాలా చూస్తున్నాం..ప్రేమించలెదన్న కోపంతో,ప్రేమించి మోసం చేసారన్న కోపంతో అలా..చంపుకుంటున్నారు.ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించేవారు తక్కువ..కాని మీడియా వారికి...కొన్ని సంఘాలకి మాత్రం ఇలాంటి విషయాలు పండగే.అలంటి హత్యలు మనము నివారించగలమా? అలా చెయ్యడానికి అవసరమైన్య చర్యలు ఏంటి? ఇలా ఆలోచించే కంటే..అలా జరిగింది అని రభస చేసే వారే అధికం.
            అసలు యువత ఎందుకు ఇలా అవుతుంది? దానికి కొన్ని కారణాలు...
  1. సినిమాల ప్రభావం...ఇనాటి యువతపై సినిమాల ప్రభావం చాలా ఉంది..అంటే వీరు వాస్తవాన్ని ఒప్పుకునే స్టేజిలో లేరు,వారికి ఇలా సిని హీరో లాగానో...సిని హీరోయిన్ లాగానో వారి జీవితం కూడా అలాగే ఉండాలి..వారికి లాగ తమకి ఒక గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఉండాలి..అలా..వారికది వ్యామోహమో..లేదా ప్రేమో కూడా తెలియదు.కాని అదే ప్రేమ అని అనుకుంటారు.
  2. ఒంటరితనం....ఇలా అవ్వడానికి ఇది ఒక కారణం...ఇంట్లో వాళకి దూరంగా ఉంటూ(దూరంగా అంటే ప్రత్యక్ష దూరంగానే కాదు...మనసులు దూరంగా కూడా..అంటే ప్రేమానురాగాలు లేకపోవడం..),తల్లితండ్రుల పర్యవేక్షణ లేకపోవడం(ఇది అన్ని సందర్భాల్లో కాదు...కొందరు దగ్గర ఉంది కూడా పట్టించుకోనివాళ్ళు ఉన్నారు)
  3. మానసికవత్తిళ్ళు...ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం.ఇలాంటి వాటిని తట్టుకోలేకా...ఎవరో ఒకరు తోడుంటే బాగుంటది అన్న స్టేజిలోకి వెళ్ళడం అలా...
  4. డబ్బు,ఆకర్షణ,అందం..ఇలా వీటితో సొంత గుర్తింపు కోసం తహతాహ లాడే కోరికలు.. 
ఇవి ముఖ్యమైన కారణాలు...ఇవి కాకుండా కొన్ని చిన్న చిన్నవి కూడా ఉన్నాయి..వీటిల్లో ముఖ్యమైనది డేటింగ్ సంస్కృతి,ఇంటర్నెట్ ..ఇలా ఇవి కూడా కొన్ని కారణాలు.ఇలా ఇలాంటివాటి వలయంలో చిక్కుకుని యువత బయటపడలేకపోతుంది.
ఇక్కడ ఒక్క అబ్బాయిల తప్పే కాదు..అటు అమ్మాయిలది,సమాజానిది కూడా ఉంది.ఎక్కడైనా మంచి చెడు అని రెండుంటాయి..అవి అందరిలో ఉంటాయి...ఎవరికీ ఎవరు మంచివారు కాదు ఎవరికీ ఎవరు చెడ్డవారు కాదు...ఈ రెండు అంటే మంచి చెడు కలయికే జీవితం....కాని మనం చెప్పుకునే సమాజ సేవ సంఘాలు కొన్ని..ఇలాంటి వాలని ఎలా మార్చాలి అని ఆలోచించే బదులు ఇలాంటి సంఘటనలని రభస చెయ్యడం ఏమాత్రం బాగోలేదు.

No comments:

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):