హాయ్...సారీ ఇవాళ లేట్ అయ్యింది..అందరికి హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే ....నాకైతే రోజు ఫ్రెండ్ షిప్ డేనే....ఇంకా స్పెషల్ గా ఎం చేస్కుంటాం చెప్పండి..ఇవాళ ౯ కి లేచాను...ఫ్రెండ్ కాల్ తో..ఫ్రెండ్ అంటే నేను వాడ్ని బావ అంటాను,త్వరగా బ్రష్ చేసుకొని..వెళ్లి వాడ్ని కలిసి..అలా హెయిర్ కట్ కి వెళ్ళాం....అలా హెయిర్ కట్ కి కూర్చోగానే అనుకోకుండా ఒక వాయిస్ వినపడింది..ఎక్కడో విన్న వాయిస్ లా ఉందే అని అలా అద్దంలో చూసాను..నా వెనక..ఒకతను కాల్ లో మాట్లాడుతున్నాడు..ఎక్కడో విన్న వాయిస్ పేస్ కూడా చూసినట్టుంది..అనుకుంటూ ఆలోచిస్తున్న....హా అప్పుడు గుర్తోచింది..అతను సినీ యాక్టర్ నరేష్ అని..(అల్లరి నరేష్ కాదండి...చిత్రం భళారే విచిత్రం నరేష్)..అలా నా చిన్నపాటి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయా ..చిత్రం భళారే విచిత్రం సినిమాకి నా ఫ్రెండ్ ఫ్యామిలీ తో వెళ్లాను ...హాల్ ఫుల్ రష్..extra చైర్లు వేసారు..నేను పెద్దగ సినిమాలకి వెల్లెవాడ్ని కాదులెండి...ఇప్పటికి తెలుగు సినిమాలంటే చూడటానికి చాల ఓపిక కావాలని వెళ్ళను..మనకంత ఓపిక లేదులెండి.
ఆ మరుసటి రోజునుండి స్టార్ట్ ఇయ్యింది స్కూల్ లో ఒక కొత్త ట్రెండ్...ఎవడినన్న తిట్టాలి అంటే "నీ ఎంకమ్మ నీ పచడి మొహానికి తాలింపు పెట్ట"...ఇలా మేము ఫ్రెండ్స్ మీ అంకుని బాగా నవ్వుకునేవాలము. ఈ ట్రెండ్ ఎలా ఉండేదంటే ఆకరికి అప్పుడప్పుడే మాటలు వస్తున్నా మా చిన్న అత్త కొడుకు..అదే డైలాగు వాడే వాడు..హిహిహి బలే నవ్వుకునే వాలము వాడి మాటలు విని..
చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో భలే అల్లరి చేసేవాడ్ని..ఒకడు ఉండేవాడు బాలాజీ అని నా ఫ్రెండ్..వాడు నాకో తోక లాగానే...నేను ఏదో డబ్బా కొట్టేవాడ్ని దానికి వాడు సపోర్ట్...ఏదన్న చెప్పి కదరా బాలాజీ అంటే వాడు అవును అవును అంటాడు..చిన్నప్పుడు వచ్చే సిరియల్స్ మోగ్లి,మహాభారతం,జేయేంట్ రోబోట్ ఇలా....బాగా డబ్బా కొట్టుకునేవాలము ఫ్రెండ్స్ దగ్గర.మోగ్లి ఎఫెక్ట్ బాగా ఉండేది..అది చూసి నేను ఫ్రెండ్స్ కి చెప్పేవాడ్ని..అటు కొండలుంటాయి..దాని పక్కనే అడవి అందులో జంతువులన్నీ నా ఫ్రెండ్స్ ..అలా...అప్పుడు బాలాజీ వైపు చూసి కదరా బాలాజీ అంటే..వాడు అవును అనే వాడు...అంత బాగా ఫ్రెండ్స్ మేము..ఇప్పుడు ఇక్కడ లేదులెండి (వాళ అమ్మగారు చనిపోయాక..వల అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత ఇయర్ కి ఒకసారి కలుస్తుంటాడు)...స్కూల్ లో కూడా బాగా అల్లరి చేసేవాలము..నా పక్కన చందు అని ఉండేవాడు...వాడు ఎప్పుడూ ఒకే టైపు లో దొరికేవాడు నాకు..ఎప్పుడూ బట్టి బట్టి బట్టి...వాడు మా స్కూల్ కి వచ్చిన కొత్తలలో పరిచయం అయ్యి నా పక్కనే కూర్చునేవాడు వాడు టీచర్ అడిగిన questionకి లేచినప్పుడల్లా...వాడి కింద పెన్సిల్ పెట్టేవాడని..అర్ధం చేస్కొండి ఆ తర్వాత ఏమయ్యేదో....
రాత్రి బాగా లేట్ అయ్యింది నా ఆఫీసు లో...సో కొంచం సేపు రెస్ట్ తీస్కుంటాను..మల్లి వస్తాను...మిగతా పార్ట్ మళ్లి వచినప్పుడు చెప్పుకుందాము..ఓకే నా ...కలుద్దాం....టాటా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment