బ్లాక్ బ్యూటీ....

Thursday, August 12, 2010

ఈ మధ్య కొంచం బిజీ అయ్యి(అంటే ఎం పని లేకపోయినా అలా నటిస్తూ ..లేకుంటే బేవార్స్ అనుకుంటారు కదా)..బ్లాగ్ లో ఏమి పెట్టాలో అర్ధం కాలేదు...కాని నిన్న జరిగిన చిన్న సంఘటన చెప్తాను..ఢిల్లీ నుండి ఫ్రెండ్ వచ్చాడు..ఇక్కడి వాడే కాని అక్కడ జాబు..సివిల్ ఇంజనీర్..అక్కడ airport ప్రాజెక్ట్ లో...ఐతే..ఈ ఫ్రెండ్ ని ఎప్పుడూ సతాయిస్తూ ఉంటాను .అతను నాకంటే ౩ ఏళ్ళు పెద్దవాడు...కామెడీ కి  నువ్వు నా గల ఫ్రెండ్ అంటూ ఉంటాను...బ్లాక్ బ్యూటీ...బుజ్జి ముండ..అయితే..నిన్న రాతిరి ఒక ఫ్రెండ్ వాళ ఇంట్లో రొయ్యలు వండుకుందాం అన్నారు(వాళ అమ్మవాళ్ళు  ఫ్రెండ్ వాళ వైఫ్ ని ,మా కొత్త చిన్ని ఫ్రెండ్ ని తీసుకునిరావటానికి తెనాలి వెళ్లారు).సరే అని రాతిరి అక్కడ పోగయ్యాము.అలా అందరం కుర్చుని మాట్లాడుకుంటున్నాము...ఇద్దరు నల భీములు(ఇద్దరు భీములే..కాని ఒక్కడే నలుపు..హి హి హి ) వంట చేస్తున్నారు.మెల్లగా మా బ్లాక్ బ్యూటీ ని సతాయించటం మొదలు పెట్టాను(అంటే అందరి కోటా అయిపోయాక...లాస్ట్ కి..మా బ్యూటీ కి అన్నమాట...ఇక్కడ డోస్ ఎక్కువ ఉంటుంది).ఇంకా స్టార్ట్ చేసాడు...ఆపురా బాబు....నువ్వు ఇక్కడే కాదు నన్ను ఢిల్లీ లో కూడా సతాయిస్తున్నావు...అదేంటి వాడు నిన్ను ఢిల్లీ లో కూడా సతాయిస్తున్నాడ అని ఫ్రెండ్స్..కలలోకి వస్తున్నాడా....మీది జన్మ జన్మల అనుభందం లాగ ఉందే అని నవ్వటం స్టార్ట్.అప్పుడు మా బ్యూటీ..." కాదురా ...అక్కడనుండి ఆన్లైన్ వస్తే...స్టార్ట్ చేస్తాడు ఇలా అనటం...కో-వర్కర్స్ ఉన్నారురా అన్న వినడు...అది చూసి అక్కడి లోకల్ వాలు మీనింగ్ ఏంటి అంటే...ఏదో చెప్పా.ఆ తర్వాత రోజు నుండి ఆఫీసు కి వెళ్ళగానే..గుడ్ మార్నింగ్ అంటే..బుజ్జి ముండ అనటం మొదలుపెట్టారు..ఒకడైతే మేనేజర్ తో మాట్లాడుతుంటే...బుజ్జి ముండ యెహ ఆన ఏక బార్ అంట.అలా ఉంది నా పరిస్తితి అక్కడ..అంటే అన్నాడు ..మా మేనేజర్ తెలుగు వాడు..వాడి ముందే ఇలా అంటున్నారు.అతను నా వంక అదోరకంగా చూస్తూ..అప్పుడప్పుడు గట్టిగ నవ్వుతూ..ఇంకా మీరే అర్ధం చేస్కొండి నా పరిస్తితి..తెలుగు అమ్మాయిలూ ఉన్నారు..వాళైతే ఒకటే నవ్వడం".అందరం భలే నవ్వుకున్నాం నిన్న...మా బ్లాక్ బ్యూటీ ఇలా చెప్పాక. హి హి హి....తర్వాత మా నల భీములు వండిన..భోజనం లాగించి...ఎవరి ఇళ్ళకు.....వాళు బయలుదేరాము..

No comments:

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):