ఇంతకి ఈ కృష్ణ బిలం అంటే ఏంటి?...హ? ...సరే చెప్తున్నా(నక్కు చెప్పటంలో అంత మంచి అనుభవం లేదు..ఏమీ అనుకోవద్దు)...కృష్ణ బిలం అనేది ఏంటి అంటే..ఈ విశ్వంలో ఏ స్థానంలో అయితే గ్రావిటీ(గురుత్వాకర్షణ శక్తి) స్థాయి చాలా ఎక్కువ ఉంటుందో..అంటే..ఏది కూడా ఈ శక్తి నుండి బయటకి తప్పించుకోలేదు..ఆకరికి వెలుగు కూడా..ఆ స్థానాన్ని కృష్ణ బిలం అంటారు.ఇవి ఎలా తయారవుతాయి? అదే కదా మీ డౌట్?...హా అక్కడికే వస్తున్నా...ఈ విశ్వంలో దేనికైనా ఒక వయస్సు ఉంటుంది..(మన పురాణాలలో ఉనట్టు..పుట్టింది ఏదైనా గిట్టక మానదు...అలా)..అలా నక్షత్రాలకి కూడా ఒక వయస్సు ఉంటుంది...అలా ఆ నక్షత్రాలు ముసలివి అయ్యాక..అంటే చనిపోటై..అలా చనిపోయిన నక్షత్రాలు..పరిమాణంలో(అంటే వాటి పరిమాణం తో పోలుస్తే) చాలా చిన్నగా అయ్యి..దానిలో ఉన్న ఆ గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ అవుతుంది...ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల..ఈ కృష్ణ బిలాలు ఏర్పడతాయి....ఏంటి అర్ధం కాలేదా..ముందే చెప్పను కదా..అర్ధం అయ్యేటట్టు చెప్పటం నాకు రాదనీ..సరే ఇంకో సారి ట్రై చేస్తాను..ఒక చిన్న ఎక్షమ్ప్లె ఇస్తా..ఓకే నా..
ఇప్పుడు మన భూమినే తీసుకోండి..మన భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది కదా..దాని వల్ల మనము భూమి మీదనే ఉంటున్నాము.. అదే కొంచం ఎక్కువ శక్తి ఉపయోగించి మనం రాకెట్,విమానాలల్లో ప్రయనిస్తున్నాం...సో అదే మన భూమి పరిమాణం చిన్నగా..చాలా చిన్నగా అయ్యింది అనుకో..అప్పుడు ఈ శక్తి అంటే గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువైపోతుంది..అప్పుడు దాని చుట్టూ ఉన్న...ఇంకా దాని ఆకర్షణ వలయం దాటి దాని పరిధిలోకి ఏది వచ్చిన...దాని నుండి బయట పడటం కష్టం...అంత శక్తి ఉంటది అన్నమాట.
ఇప్పటికన్నా అర్ధమయిందా...హి హి హి..సో ఇలా ఏర్పడతాయి..కృష్ణ బిలాలు.ఇంకో విషయం..ఈ నక్షత్రాలు అంటే చనిపోఎవి...మనకి తెల్సినంత పెద్దగ కాదు...చాలా పెద్దగ ఉంటై..మన సూర్యుడికంటే పెద్దగ..20 రెట్లు పెద్దగ ఉంటాయంట.మన శాస్త్రవేత్తలు(అంటే మన దేశం నుండే కాదండి..ఇతర దేశాల వారే ఎక్కువ వీటి మీద స్టడీ చేసేది)..వీటిని తెగ స్టడీ చేస్తుంటారు...అసలు ఎన్ని కృష్ణ బిలాలు ఉన్నాయో వాళ్ళు కూడా చెప్పడం కష్టం..ఇవి అసలు ఇలా ఎంత కాలం ఉంటై..అనే సందేహం కూడా వచ్చింది..ఐతే ముందు అసలు ఇవి ఇలానే ఉంటాయి అని అనుకునేవారు..కాని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అధ్యయనం చేసి...అవి అలా ఎప్పుడూ ఉండవు అని చెప్పారు..ఒక సమయం వచ్చాక(అంటే అ పది నిముషాలో...నెలో..సంవత్సరం..అలా కాదండి...ఎన్నో సంవత్సరాలు..మనము కూడా ఉండము అన్ని..ఊహించుకోలేము కూడా..) అవి కూడా చనిపోతాయి అని చెప్పారు..అది ఎలా అంటే...వాటి ఆకర్షణ శక్తి పని చేస్తూ ఉన్నప్పుడు దానిలోని ఆ శక్తి మెల్లగా తగ్గుతూ ఉంటుందంట..అలా మొత్తం తగ్గిపోయాకా...అవి...విశ్వంలో కలిసిపోతాయంట..
ఇంకొందరు శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి...ఈ బిలాలు..వేరే విశ్వానికి దారి అనుకుంట..ఇవి ఇలా లోపలికి అన్నిట్లని పీల్చుకొని..వేరే విశ్వం లో వాడులుతయంత...ఏమో మరి ఇదైతే ఎవరికీ నమ్మసక్యంగా లేదు..వీటిని bridges లేదా wormholes(వార్మ్ హోల్స్) ...ఇది కల్పితం అంటే ఉహజనితం మాత్రామే...
ఇంతకి మన వాళు కృష్ణ బిలం అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఏమీ లేదండి..కృష్ణ అంటే నలుపు...అందుకే కృష్ణ బిలం అన్నారు..అక్కడ అంత నల్లగా ఉంటుంది కదా..చాలా వరకు కృష్ణ అంటే..దేవుడి పేరు అన్కుంటారు...అది తన నామలల్లో...ఒక పేరు...నల్లనివాడు అని..మీకు ఇంకో విషయం తెల్సా...కృష్ణ అంటే ద్రౌపది పేరు కూడా...ఇలా కూడా అనుకోవచు..క్రిశుండు...మాయ చేస్తాడు కదా..అలాగే..బిలం లోకి వెళ్ళే అన్ని ఏమవుతున్నాయో ఎవరికీ తెలియదు..అదీ మాయే కదా...ఎందుకంటే మనము వెళ్ళలేము...
అది అంది సంగతి...ఎమన్నా సందేహాలు ఉంటె లేదా నేను ఎమన్నా తప్పు పెట్టి ఉంటె...సంకోచం లేకుండా చెప్పండి...ఆ తప్పు సరిదిద్దుతాను..ఓకే నా...
No comments:
Post a Comment