హాయ్...ఎలా ఉన్నారు..అంత కుశలమేనా?...నాదేముందిలే ఇవాళ ఉదయాన్నే బుక్ అయిపోయాను....ఎందుకా...ఏమిలేదు..ఇవాళ రాఖి కదా..
అందుకే.. ఒక రెండు మూడు రోజుల నుండి గుర్తుంది రాఖి కదా అని...ముందే రాఖి గిఫ్ట్ అని ఏదో ఒకటి కోనేయల్సింది...అక్కడే తప్పు చేసాను..ఇవాళ ఉదయాన్నే లేచి,రెడీ అయ్యి..అలా కిందకి వచాను...అప్పుడు చూసాను మా కజిన్ చెల్లెల్ని...ఎటాక్ అన్నటుగా రెడీగా ఉంది...స్నానం చేశావా అన్నది(కామెడీగా..ఎందుకంటే నేను ఏడింటికే చెయ్యడం చాలా అరుదు..ఏదో ఆఫీసుకి త్వరగా వెళ్ళాలని రెడీ అయ్యాను లెండి)...కోతి ఏంటే అంటున్నావ్ అంటే...అబ్బ రాఖి కట్టాలి కదా అన్నయ్య అందుకే అడిగాను అంటే..వచ్చిన కొంచం కోపం తగ్గిపోయింది అలా అడిగినందుకు.సో రాఖి కట్టింది..స్వీట్ పెట్టింది...అక్షింతలు వెయ్యమన్నది..డాడ్ ఒక పక్కా పూజ చేస్కుంటూ చూస్తున్నారు...నాకేమో దీవించడం రాదు..ఏమనాలి..ఏదో అక్షింతలు వేసాను...డాడ్ ఏమో దీవించు రా అని..ఏమని దీవించాలి తెలియదు...ఏదో ఒకటి..మంచే జరగాలి లెండి..అని నేను..(ఒక పక్క మనసులో..అమ్మో ఎంత వదుల్తుందో ఏంటో అని..టెన్షన్).సరే కట్టాకా...ఎం కావాలి రా అన్నాను..ఎం వద్దు'లే'..అని అనింది.పర్లేదు చెప్పు అంటూ..మొబైల్ కొనుక్కో అని ఇచ్చాను..(ఇంకా చూడాలి ఆనందం నా చెల్లెలు మొహం లో)...సరే ఇంకా నేను టిఫిన్ చేస్తూ..మొన్న ఏదో laptop తీస్కోవచ్చా అని అడిగింది..సో అది అడిగాను ఆ సిస్టం డిటైల్స్ కనుక్కున్నావా అని..హ కనుక్కున్నాను...మెయిల్ లో ఉంది నీకు ఫార్వర్డ్ చేస్తాను అని చెప్తుంది..అలా చెప్పటం ఆపిందో లేదో..డాడ్ పూజ ముగించి...లేస్తూ...ఆ laptop కొనుక్కో..ఎంత అవుతుందో అది వీడు కడతాడు...అని...అంతే.....నాకు డాం అన్నది...ఆ విషయం ఎందుకు తీసానురా దేవుడా అనుకున్న...
అలా ఆఫీసుకి వచ్చేసాను.....అలా పేపర్ చూస్తుంటే.(ఈనాడు),ఒక చోట చిన్నగా ఒక ఫోటో ఇచ్చాడు అది నన్ను బాగా ఆకట్టుకుంది..
చూసారా ఆ ఫోటోని ...ఆ ఫోటోలో కనపడ్తున్న కుర్రాడి పేరు నరసింహ..ఉండేది మన హైదరాబాద్ లోనే అంట..అమ్మ లేదు..చనిపోయింది...తన చిట్టి చెల్లికి తనే స్నానం చేపిస్తున్నాడు...భలే ముచ్చటగా ఉంది....నాకు అనిపించింది..చేల్లెకి అన్ని తానయ్యి చేస్తున్నాడు...ఇదే నిజమైన ప్రేమ..ఇవాళ రేపు..జనాలలో ఎంత మార్పు వచ్చిందంటే..ఎవరికీ టైం లేదు..దేనికి అలాంటి ప్రేమ చూపించటానికి..కాదంటారా?
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Lucky is your sister who's having a wonderful brother like u
i can only say share love it costs no money
Post a Comment