మీకు తెలుసా?

Saturday, August 21, 2010

                శుభోదయం..ఏంటి మీకు తెలుసా అంటున్నాడేంటి అనుకుంటున్నారా...ఏమీ లేదు..ఇవాలా మీకు ఒక కొత్త విషయం చెప్తాను..కొత్త అంటే కొత్త కాదు..పాతదే..కానీ మనకి తెలియంది..అబ్బ నాసా..ఏమీ చెప్పకుండా  అనుకుంటున్నారా,ముందు నేను అడిగే ప్రశ్నకి మీకు జవాబు తెలుసేమో చూడండి..మన రైలల్లో బాత్ రూమ్స్ ఎప్పటినుండి స్టార్ట్ చేసారో మీకు తెలుసా?...సరే సరే...బుర్ర గోక్కోవద్దు..నేనే చెబుతా...1909 తర్వాత మొదలు పెట్టారు మన రైల్వేవారు...
     ఏంటి పోయి పోయి ఇదా చెప్పేది అంటున్నారా....ఇది కొంచం నాలెడ్జ్ కదా..అందుకే...ఇది చెయ్యటం భలే గమ్మత్తుగా జరిగింది..(ఒక వారం క్రితం వరకు నాకు తెలియదు...బుక్ చదువ్తుంటే తెలిసింది...).
        1909లొ ఒఖిల్ చంద్ర సేన్ రైలు లో ప్రయాణిస్తూ..తనకి జరిగిన అనుభవం(అనుభవం అనటం కంటే అవమానం అనొచ్చు) ఒక కంప్లైంట్ లాగ రైల్వేస్ వారికి ఉత్తరం రాసాడు...అది అతను వ్రాసినట్టే చదువితే బాగుంటుంది..చూడండి....
    "I am arrive by passenger train Ahmedpur station and my belly is too much swelling with jackfruit.Iam therefore went to privy.Just i doing the nuisance that guard maling whistle blow for the train to go off and am running with lotah in one hand and dhoti in next when i am fall over and expose all my shocking to man and female women on plateform.Iam got leaved at Ahmedpur station.
         This is too much bad,if passenger go to make dung that dam guard not wait five minutes for him.I am therefore pray your honour to make big fine on that guard for public sake.Otherwise i am making big report to papers".
      ఇది అతని అనుభవం..హి హి హి..(ఇక్కడ నవ్వింది అతని పరిస్తితి చూసి...అతని ఇంగ్లీష్ చూసి కాదు...ఏదైనా అతని పుణ్యమా అంటూ..ఐ కంప్లైంట్ తర్వాత రైల్వేస్ వారు బాత్ రూమ్స్ పెట్టారు రైల్వే బోగిలకి)..ఎం లేదండి ఆ కంప్లైంట్ లో ఏమని పెట్టదంటే..తను రైలులో ప్రయాణిస్తూ ...పనస పండు తిన్నదంతా..ఐతే కడుపులో గందరగోళం అయ్యి...ఒక స్టేషన్లో ఆగితే....కడుపు ఖాళి చేస్కోటానికని వెళితే...రైలు వెళ్ళిపోయిందని..అందుకు కారణమైన గార్డ్ పై చర్య తీస్కోవాలని కొంచం గమ్మత్తుగా రాసాడు.
   మొత్తానికి అతని పుణ్యమా అంటూ మనం అందరం రైలు ప్రయాణం..ఏ అడ్డంకులు లేకుండా...సుఖంగా ..హాయిగా....అనుభవిస్తున్నాం.

1 comment:

Unknown said...

mottaniki chandra sen valla raillalo toilets unnai anduku ataniki thks naaku neevalla ee nijam telisindi anduku neeku thks enka elanti enno vishayaalanu maavaraku andajeya mani korutunanu

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):