డైలాగ్ ఇన్ ది డార్క్...

Tuesday, February 1, 2011

ఇవాళ అలా పేపర్ తిరిగేస్తుంటే..చూసాను 'డైలాగ్ ఇన్ ది డార్క్' అని ..చాలా మంది చదివే ఉంటారు అది..
 అసలు ఈ డైలాగ్ ఇన్ ది డార్క్ ఏమిటి అనే కదా..అది ఒక ఆర్గనైజేషన్ ..చూపులేని వారిలో ఆత్మవిశ్వాసం నింపి తమ కాళ్ళ మీద తాము నిలబెట్టటం వీరి ముఖ్య ఉద్దేశం..ఈ మధ్యనే మన దేశంలో అదీ హైదరాబాద్లో పెట్టారంట.
  అందులో విశేషం ఏముంది...అదీ చాలా మంది చేస్తున్నదే అని అనుకోవచ్చు..కాని..ఈ  కంపెనీ వాళ అప్రోచ్మేంట్ వేరు..ఇక్కడ చూపులేని వారు మనలాంటి వాలకి అంటే 'చూపు'ఉన్న మనకి మార్గదర్సులుగా వ్యవహరిస్తారు.ఇలా ఎందుకు అంటే..వారు 'మన'లో ఒకటే అని..వేరు వేరు కాదని మనం గ్రహించటం కోసం.నిజమే..మనలో చాలా మంది గుర్తిచానిది..మనం 'చూపు'న్నా అన్ని చూడలేని వాలము..వారికి చూపు లేకపోయినా 'అన్ని'చూడగలరు...

     చూపు అని చూస్తే ఎప్పుడూ నాకు ఒకటి గుర్తొస్తుంది...ఒకసారి స్వామి వివేకానంద అమెరికా వెళ్ళునప్పుడు..అక్కడ ఒకతను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు..వివేకానందని అవమానిద్దాం అని తన బల్ల మీద కొన్ని పుస్తకాలు ఒకదాని మీద ఒకటి పేర్చాడు అందులో అట్టడుగున భగవద్గీత,అన్నిటి పైన బైబిల్ ఉంచాడు..వివేకానంద వచినాకా..ఆ బల్ల ముందు కూర్చోబెట్టి అవి ఇవి మాట్లాడుతూ గమనించాడు..అతనికి ఆశర్యం వివేకానంద ఏంటి అది గమనించలేదు అని..తీర ఆఖరికి అతనే అన్నాడు వివేకానందతో..ఇక్కడ పుస్తకాలు చూస్తే మీకు ఏమీ అనిపించటం లేదా అని..అప్పుడు వివేకానంద అన్నాడు "ఆ పుస్తకాల ఆధారము చాలా బలంగా ఉంది".
   ఏంటి ఇలా చెప్పాడు అని ఆలోచిస్తున్నారా...చూపులేని వారికీ ఈ ప్రస్తావనకి సంభంధం ఏమిటి...ఇక్కడ మొదట చూడాల్సింది..ఆత్మవిశ్వాసం...రెండు..పాసిటివ్ థింకింగ్ ....అవి రెండు మనలో కంటే వారిలోనే ఎక్కువ ఉంటుంది..ఇక్కడ వివేకానందుడు తన 'దృష్టి'తో చూసాడు..చూపుతో కాదు..దానికి అతను అలా కృంగిపోయి బాధపడలేదు...పాజిటివ్గా అలోచించి తగు సమాధానం చెప్పాడు.ఇలా చాలా తక్కువ మంది ఉన్నారు.ఎంత మందిమి ఇలా చెప్పగలం? చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోవడమో..బాధపడటమో చేస్తుంటాము...మరి 'చూపు'న్న మన పరిస్తితే ఇలా ఉంటె..లేని వారి పరిస్తితి అలానే ఉందా..కాదు అంటాను నేను..మనకంటే వాళ్ళకే ఎక్కువ ఆత్మవిశ్వాసం..పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి..
          ఇందాక అనుకున్నాం కదా..వారు మనకి మార్గాదర్సులుగా వ్యవహరిస్తారు అని..ఈ 'డైలాగ్ ఇన్ ది డార్క్' వారు కొన్ని ఆర్ట్ ప్రదర్శనలు అలా పెడతారు..అదీ చీకట్లో కూడా కొన్ని ఉంటాయి..వాటిని చూడటానికి వారు మనకి సహాయ పడతారు...
  చూసారా ఈ కాన్సెప్ట్ ఎంత బాగుందో.ఇక్కడ..మనం ఎలాగో వారికి సాయపడం..వారు మనకి సహాయం చెయ్యడంలో వెనకడుగు వెయ్యరు అని...మనకి కొంచం బుద్ధి వచ్చేలాగ."కళ్ళున్న మన మనోనేత్రాలు తెరిపించడానికి వారు చేస్తున్న ఒక యజ్ఞం "..ఏమంటారు? ఒకసారి ట్రై చెయ్యండి ఆ ప్రదర్శనకి వెళ్లి...అంటే నేను చేసానో లేదో అనా..నాకు ఇవాలే తెలిసింది నేను ట్రై కాదు పక్కా వెళ్తాను.

No comments:

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):