స్వాతంత్ర్య దినోత్సవం....

Sunday, August 15, 2010

స్వాతంత్ర్య దినోత్సవం....చిన్నప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం అనగానే..మాకు గుర్తొచ్చేది..బడికి సెలవని..స్వీట్లు పంచుతారని..కొంచం ఊహ వచ్చాక తెల్సింది స్వతంత్ర్యం అంటే ఏంటి అని...(మరీ ఇప్పటి కాలం పిల్లల్లా కాదు లెండి)....అయ్యో మర్చిపోయ..స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు.మనకి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుందో మీకు తెలుసా?...కరెక్ట్ చెప్పారనుకుంట...పోనీ నేనే చెపుతానులే.మొత్తం 63 ఏళ్ళు పూర్తిచేసుకున్నాము.మీకు చిరాకు తెప్పించనులే...మన చరిత్ర గురుంచి చెప్పి....అది అందరికి తెలిసే ఉంటుంది.
    కాని ఒకే ఒక ప్రశ్న....మనం స్వాతంత్ర్యం తెచ్చుకుని ఇప్పుడు ఏ స్తాయిలో ఉన్నాము?.....ఆలోచిస్తున్నారా? ...అంత కష్టం వద్దులే..నేనే చెప్పేస్తాను...
        ఎకానమీ..మన ఎకానమీ ప్రపంచంలోనే..4వ అతి పెద్దది.మనది డెవలప్ అవుతున్న దేశం..సో మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొదువే లేదు.అలాగే ఇన్ఫర్మేషన్,కమ్యూనికేషన్ మనకి చెప్పుకోదగ్గ పోసిషన్ లో ఉన్నాము.మన ఇస్రో అద్వారంలో 10 రిమోట్ సెన్సింగ్ శాటెలైట్లు నడుస్తున్నాయి.వ్యవసాయంలో(మనము అరటి పళ్ళు,మామిడి,నిమ్మ,బోబస్కాయ,అల్లం,వాక్క..ఇలా ఇవి ఉదాహరణకి కొన్ని ...వీటి ఉత్పత్తిలో మనమే ప్రధమ స్ధానం.పాల ఉత్పత్తిలో కూడా మనమే ప్రధమం),ఇండస్ట్రీస్ లో,సర్వీసెస్ ఇలా మనము కొంచం ముందున్నాము..సినిమా రంగంలో కూడా మనం చెప్పుకోదగ్గ స్తాయిలో ఉన్నాము.మనది ప్రపంచం లోనే రెండవ స్థానము.ఇంకో విషయం తెలుసా..మన దేశం లో ఒక్కటే హాలీవుడ్ సినిమాలు మన సినిమాలని బీట్ చెయ్యలేకపోయాయి.
    ఇదంతా నాణానికి ఒక ప్రక్క..ఇంకో ప్రక్క..
   పేదరికం..తెలుసా..లోకంలో ఉన్న బీదవాలల్లో ౩వ వంతు మన దేశంలో ఉన్నారని?ధనిక దేశాలతో పోటి పడుతూ..ప్రపంచంలోనే..రెండవ బాగా ఎకానమీ అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిన దేశంలో..400 మిలియన్ మంది పేదరికంలో మగ్గుతున్నారు.అభివృద్ధి జరుగుతన్న దేశాలతో పోలిస్తే మన స్థానం ఎక్కడో వంద పైన ఉంది.చైల్డ్ లేబర్..ఇందులో కూడా మనం చెప్పుకునే "మంచి" పోసిషన్లో ఉన్నాము.మన దేశంలో పౌష్టిక ఆహరం లేని పిల్లలు దాదాపు సగం ఉన్నారు.ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే,,మనకి తెలిసిన్న్ది..ఒక్కటే..క్రికెట్(అంటే పేకాట..బెట్టింగ్  కాకుండా  హి హి హి మన వాళ్ళకి క్రికెట్ కాకుండా బాగా తెలిసిన ఆటలు ఇవే),చదరంగం, ఈ మద్య బాడ్మింటన్,అప్పుడప్పుడు టెన్నిస్.(సానియా వల్ల అని అనుకునేరు..కాదు కాదు...మన మహేష్ భూపతి,లియాండర్  వల్ల   ).మనము ఈ క్రీడల్లో తప్ప...మొత్తం క్రీదవిభాగంలో ప్రపంచ పట్టికలో చుస్తే...ఎక్కడో కింద ఉంటాము....చెప్పడం మరిచాను కారప్షణ్ లో కూడా మనం....ఇంకా చెప్పేది ఏముంది.....అర్ధం అయ్యింది అనుకుంట..కదా..
               సో ఇది మన పరీస్తితి...నాణానికి ఇలా రెండు ఉన్నట్టే...మన దేశానికీ కూడా ఉండాలి...బాలన్సు చెయ్యాలి కదా..
అసలు చెప్పడానికి ఇంకా చాలా ఉంది..సమయం వచ్చినప్పుడు అలా చెబుతుంటాను...సరేనా..(నిజం చెప్పాలంటే తెలుగులో టైపింగ్ కొంచం కష్టంగా ఉంది...)

No comments:

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):