స్వాతంత్ర్య దినోత్సవం...మన ప్రధానమంత్రి ప్రసంగం

Monday, August 16, 2010

హాయ్..నిన్న ప్రధాన మంత్రి ప్రసంగం విన్నారా?....ఎం వింటాంలే..కదా....నేను ఒక 5 ఏళ్ల కింద వరకు వినేవాడిని కాదులే...ఏదో అలా అలా వినటం మొదలు పెట్ట...ఈసారి ప్రసంగం అంత చప్పగా ఉంది...ఈసారి ప్రసంగంలో కొన్ని పాయింట్లు విశ్లేషిద్దాం.వాకే నా?
            కాశ్మీర్,ఈశాన్య రాష్ట్రాలు గురుంచి..చెప్పారు
                                   మన ప్రధానమంత్రి ఏమి చెప్పారు...కాశ్మీర్,ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ప్రజాస్వామ్య పంథాలో దేశ సంక్షేమం కోసం శ్రమించాలి అన్నారు.బాగుంది...కాని వాస్తవ పరిస్తుతులు ఏంటి? మొన్నటికి మొన్న కాశ్మీర్ లో ఎంతగా గొడవలు జరుగుతున్నాయో మీరు వార్తల్లో చూసుంటారు...మగవారే కాదు..ఆడవారు,ఆకరికి పిల్లలు కూడా..గొడవల్లో పాల్గొంటున్నారు....ఇంతగా గొడవలు జరుగుతుంటే..అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కాని..మన దేశ ప్రభుత్వం కాని..ఎమన్నా చర్యలు చేపట్టార? ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇంచుమించు పరిస్తితి ఇంతే..మనము ఎం చెర్యలు తీస్కోకుండా(అంటే అక్కడి ప్రజలకి సాయం చెయ్యకుండా )...వారిని ఇలా చెయ్యండి అంటే..వాళు మనకంటే..ముందు..విధ్రోహశక్తులకి   మొగ్గుచుపుతారు...వాలని అలా మొగ్గుచుపకుండా ఎమన్నా చర్యలు తీసుకున్నమా?
         వరి,గోదుమల మద్దతు ధర ..అధికారంలోకి వచాక..కనీస మద్దతు ధర దాదాపు  రెండింతలు చేసాము అన్నారు..బాగానే ఉంది..అది రైతన్నలకి కొంచం ఉపయోగం...కాని అలా సేకరించిన ధాన్యాన్ని...నిలువ ఉంచి ఏమి సాదించారు?..ఈ మధ్య పేపర్లో చూసాను...గిడ్డంగుల్లో పెట్టిన ధాన్యం కుళ్ళిపోవడం,పందికొక్కులు తినడం..ఇలా వేస్ట్ ఇయ్పోతుంది అని...మన జనాభాలో మూడోవంతు ప్రజలు పేదరికంలో ఉన్నారు...అవి వాలకి పంచొచ్చు..కాని మన ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటేగా?..ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు?
    ఈ రెండు విషయాలు తప్పించి...ఇంకా చెప్పుకోదగ్గవి అంత పెద్దగ ఏమి లేవు...ఇంకా వ్యవసాయంకి,అధిక ధరలపైన,అందరికి విద్య,ఆరోగ్యం..ఏదో అలా చెప్పుకొచ్చారు..
   ఇవ్వన్ని మార్చడానికి ఏమి చెయ్యాలి అనుకుంటున్నారో కూడా చెప్పనేలేదు..
     ఇది మన దేశం స్వాతంత్ర్యం వచ్చి 63 ఏళ్ళు నిండినా...మన దుస్తితి ఇది...
    మీ బుర్రలు వేడెక్కినట్టున్నాయి...కాఫీ తాగుతారా...ఐతే కాఫీ పెట్టుకొని తాగండి...హ్యాపీగా .....
   

No comments:

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):