హాయ్...మాకు నిన్న వచ్చింది స్వాతంత్ర్యం..హి హి హి..

Tuesday, August 17, 2010

హాయ్...శుభోదయం...ఏంటి టైటిల్ చూసి...ఇదేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా...హి హి హి...ఏంటంటే..మొన్న ఆదివారం(మన స్వాతంత్ర్య దినోత్సవం)...మేము ఫ్రెండ్స్ పార్టీ చేసుకునే టైం..కాని ఆ రోజు బంద్ కారణంగా పార్టీ చేసుకోలేకపోయం..పైగా ఆ రోజు పడ్డ వర్షానికి..అందరకి డల్ గా అనిపించింది..ఎంజాయ్ చెయ్యలేకపోయామే అని..ఫ్రెండ్స్ ఆ రోజు..స్వతంత్ర్యం స్వాతంత్ర్యం అని అంటున్నారు...అది సెలెబ్రేట్ చేసుకునే స్వాతంత్ర్యం కూడా లేదు...అని బిక్కమొహాలు వేసుకున్నారు(నేను కూడా ఉన్నానులే)..ఇంకా నిన్న చూడాలి...సాయంత్రం అయ్యేసరికి అందరం కలిసాము...పార్టీ టైం అని..ఇంకా మా రెగ్యులర్ అడ్డాలో కూర్చున్నాం....ఇంకా మా బాతాఖాని లోకి దిగాము...పోలిటిక్స్,వర్క్,టెక్నాలజీ,న్యూస్,మూవీస్..ఇలా మాకు ఏది అనర్హం కాదు.ఇలా మా మాటల్లో శ్రీరామ్ అనే అతని గురుంచి వచ్చింది..ఇండియన్ అయ్దల్ గెలుచుకున్నాడు అని అందరు తెగ సంబరపడిపోతున్నారు అని..సో నేను అదే ఆలోచిస్తున్న..నిన్నటి నుండి...మనం ఎంత పిచ్చోలము కాకపోతే..మనకి దేనికి పనికి రాణి వాటిని చూసి తెగ సంబరపడిపోతున్నాము..(అతను తెలుగువాడు అయ్యి ఉండొచ్చు..భాష అభిమానం ఉండొచ్చు..తప్పు లేదు...నేను ఇక్కడ శ్రీరామ్ ని కించపరచటం లేదు..అతనికి టాలెంట్ ఉంది....ఉంటె అతను ఎలాగో గెలుచుకుంటాడు..)
నిన్న ఆన్లైన్ లో లో కొంత మంది ఫ్రెండ్స్ ఇదే విషయం తీస్తే అడిగాను..వాళు ఎప్పుడన్నా సామాజిక సమస్యల పైన పోల్ లో కాని..ఆన్లైన్ లో కాని ఓటింగ్ చేసారా అని..కాదు అని జవాబు ఇచ్చారు..రోడ్ మీద చిన్న చిన్న బొమ్మలు అమ్ముకుంటున్న చిన్నపిల్లలా దగ్గర(బొమ్మలు అంటే బొమ్మలు అనే కాదు...బుగ్గలో,పేపర్,ఇలా..ఇవన్న కాని..పోనీ అడుక్కుంటున్న పిల్లలు) ఎమన్నా కొన్నారా అని..లేదు ఎవరు చెయ్యలేదు..వీలకి ఇవ్వడానికి మనకి ఆ ఒక్క రూపాయి కూడా కష్టమే..కాని ఇలాంటి షోస్ కి..మెసేజ్ లు మాత్రం ఎంత ఖర్చు  అయిన..ఎన్ని మెసేజ్ లు అయిన ఇట్టే చేసేస్తాం. కాని ఒక్కసారి ఆలోచించండి..ఇలాంటి పిల్లలకి(పేదవారు,అనాధలు) ఏదన్న సహాయం చేస్తే..వాలకి ఎంత సంతోషంగా ఉంటుందో..ఒక్కసారి...ఉహించండి..అడుక్కునే పిల్లలకి డబ్బులు ఇమ్మంటున్నావా? అని అనొచ్చు మీరు..ఈ మద్య ఎవరు అలా చెయ్యటం లేదు..ఏదో చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటున్నారు..వాటికి పెద్దగ ఖర్చు కూడా కాదు..పైగా అందులో కొన్ని మనకి పనికోచ్చేవే..అవి కొన్న చాలు(మనం మనకి తెలియకుండా పెట్టె వృధా ఖర్చుతో పోలిస్తే..ఈ ఖర్చు ఒక మూలకి రాదు)..కొంటె ఆ డబ్బు వాడికి ఆ రోజు ఆకలి తీరుస్తుంది.కాదంటారా? ..ఇలా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి..కాని మనకి అంత టైం లేదు....కదా...

No comments:

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):