మన ఎంపీలు...వారి జీతాలు

Tuesday, August 31, 2010

ఈ మధ్య ఈ టాపిక్ బాగా వినుంటారు....మన ఎంపీలు..వారి జీతాలు పెంచాలని వారికి వారే పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేసుకున్నారు..అసలు వారికి అంత జీతాలు అవసరమా? ...ముందు మన ఎంపీల గురుంచి చెప్పుకుందాం..ఓకే నా..
       మన ఎంపీలకి మన ప్రభుత్వ సదుపాయాలు ఏంటో తెలుసా మీకు?...వారికి ఇచ్చే జీతం కాకుండా...వారికీ నెలకి లక్ష ఫోన్ కాల్స్ ఉచితంగా,ఇండియాలో ఎక్కడికైనా ఉచితంగా ఫస్ట్ ఏసీ రైలు ప్రయాణం(వారి కుటుంబం లో కూడా ఒకరికి కూడా)...కార్ కొనుక్కోడానికి వడ్డీ లేని ఋణం..దానికోసం పెట్రోల్ అల్లోవన్సు..ఒక ఇల్లు...దానికి పని వాళ్ళు..ఇలా ఎన్నో...ఆకరికి సోఫా కవర్లు ఉత్తుక్కోడానికి నెలకి వెయ్యి అల్లోవన్సు(అలా ఇవ్వక పోతే వాళ్ళు అవి కూడా ఉత్తుక్కోరనేమో)..వాలకి సెక్యూరిటీ ఇలా...ఎంత కర్చు...ఇదంతా మనమే కదా కట్టాల్సింది...అయిన ఇది మనకెందుకులే అనుకోవడమే మన పని..కదా....అవును చెప్పడం మరిచాను...ఒక్కో ఎంపీకి ఒక ఏడాదికి అక్షరాల ఒక కోటి రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళ క్షేత్రాలల్లో కర్చుపెట్టమని ఇస్తుంది మన ప్రభుత్వం(అసలు ఎంత మంది అలా ఖర్చుపెడుతున్నారు...వారికే తెలియాలి..ఈ మద్య తెలిసినదేంటి అంటే..అది రెండు కోట్లు చేసారని..)
    ఏమైందో ఏమో ఈ మధ్య మన ఎంపీలకి ఈ జీతం సరిపోదంతా..వాలకి నామోషిగా ఉందంట...ఎందుకో తెలుసా? వాళ కింద పని చేసే..అంటే ఆఫీసు బోయ్స్ అలా కాదండి...పెద్ద ఆఫీసర్ పోస్ట్ వాలకి వీరి కంటే జీతాలు ఎక్కువంట.వాలకి 80000 జీతం అంట...అందుకే వీరికి వారికంటే ఒక్క రూపాయి అన్న ఎక్కువ ఉండాలంట జీతం.
       సరే పోనీ ఇద్దాము అనుకుందాం..మన కళాశాలల్లో 75 % హాజరు లేనిదే..పరీక్షలు రాయనీయారు...మన వాళ హాజరు ఎంత ఉందొ మీకు తెలుసా? సగం మందికి...కనీసం యాబై శాతం కూడా లేదంట..ఇంకా నాకు తెలిసి మన రైల్వే మంత్రిగారైతే..ఇప్పటి వరకు అంత తక్కువ హాజరు ఉన్న మంత్రి ఉండరేమో...పోనీ అలా అనుకున్న....మనకి ఉన్న ఎంపీలలలో 72 మంది ఏదో ఒక కేసు లో కోర్ట్ చుట్టూ తిరుగుతున్నా వారే..అది మోసం కేసు నుండి..హత్య కేసులా వరకు ఉన్నాయ్....మరి ఇయ్యాలి అంటారా?
 పోనీ అక్కడ సరే అనుకుందాం...వాళ కింద ఆఫీసెర్లు అంటే ఎన్నో చదువులు చదివి..పోటి పరీక్షల్లో నెగ్గి...ఉద్యోగం సంపాదించిన వారే..మరి వీరో,వారికున్న జ్ఞానంలో సగం అయిన ఉందంటార? అసలు మన వాళు పార్లమెంట్ లో కొట్టుకోదానికే టైం ఉండదు...పైగా సగం మంది అసలు మాట్లాడరు అంట..వీరికేందుకు ఇవ్వాలి మరి అంత జీతం?..ఇలా జరగడానికి కారణం మనమే....మనకెందుకులే అనే ధోరణే ఇలా....ఇంత తెలిసి మనం ఎప్పుడూ చేసే తప్పునే చేస్తున్నాం.
     మీకు తెలుసా...మన ఎంపీల ఆస్తి పాస్తులు..దగ్గర దగ్గర మూడు నాలుగింతలు అయ్యిందంట పోయిన 9 ఏళ్ళల్లో.
మరి మీరే ఆలోచించండి...వాలకి ఇంత జీతం అవసరమా లేదా అని....

No comments:

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):